Site icon HashtagU Telugu

Drinking Milk: రాత్రి పూట పాలు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Drinking Milk

Drinking Milk

మనలో చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే కొందరు ఉదయం పూట తగితే మరి కొందరు రాత్రి పడుకునే ముందు పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగడం వల్ల రాత్రిపూట నిద్ర బాగా పడుతుందని పాలు తాగుతూ ఉంటారు. మరి రాత్రిపూట పాలు తాగడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు, ఇతర పాల ఉత్పత్తుల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ శరీరంలో మెలటోనిన్, సెరోటోనిన్ రెండింటి సంశ్లేషణకు పనిచేస్తుంది. మెలటోనిన్ ను స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు.

ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇకపోతే సెరోటోనిన్ బహుముఖ న్యూరోట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతుందట. పాలు లేదా పాల ఉత్పత్తుల వినియోగం వృద్ధులలో నిద్రను మెరుగుపరుస్తుందట. గోరువెచ్చని పాలను తాగడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెబుతున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరికీ పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రిపూట పాలు తాగడం మంచిది. కానీ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఇది అంత మంచిది కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రక్రియ మీ శరీరం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. అలాగే మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుందట. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వారు రాత్రిపూట పాలు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు.

Exit mobile version