Site icon HashtagU Telugu

Hot Water: ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 24 Dec 2023 05 31 Pm 8846

Mixcollage 24 Dec 2023 05 31 Pm 8846

కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. అటువంటి వాటిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొరువెచ్చని నీరు తాగడం కూడా ఒకటి. చాలామందికి అంతకుముందే నుంచే ఈ అలవాటు ఉన్నప్పటికీ ఇంకొంతమంది కరోనా తర్వాత దీనిని అలవాటుగా మార్చుకున్నారు. మరి ఖాళీగా కడుపుతో వేడి నీరు తాగడం వల్ల నిజంగా అన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిని తాగితే అధిక బరువు నుంచి బయటపడవచ్చు. కొలెస్ట్రాల్‌ తగ్గడంతో పాటు, పొట్ట కూడా తగ్గుతుంది.

గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే పేగుల్లో కదలికలను ప్రేరేపిస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దరిచేరదు. ఉదయాన్నే పడగడుపున గోరు వెచ్చని నీటిని తీసుకుంటే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందట. కడుపు నిండిన అనుభూతి కలగడంతో పాటు, ఆహారం త్వరగా జీర్ణమై కొవ్వు పేరుకుపోయే అవకాశం తగ్గడం వల్ల బరువు పెరుగుదల అనే సమస్య రాదు. చలికాలంలో ముక్కు దిబ్బడ సమస్య ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్యకు కూడా గోరు వెచ్చని నీటితో చెక్‌ పెట్టవచ్చు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే ముక్కు దిబ్బడ సమస్య నుంచి బయటపడవచ్చు.

శ్వాస తీసుకోవడం తేలిక అవుతుంది. అలాగే కండరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలా అని మోతాదుకు మించి వేడి నీటిని తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. వేడీ నీటిని మోతాదుకు మించి తీసుకుంటే శరీరంలో నీటి సాంధ్రతలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గోరు వెచ్చని నీటిని అధికంగా తీసుకుంటే అది నిద్రలేమికి కారణమవుతుంది. ఇది స్లీప్‌ క్లాక్‌పై దుష్ప్రభావం చూపుతుంది. వేడి నీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్ర పిండాలపై దుష్ప్రభావం పడుతుంది. ఇలా చేయడం వల్ల మూత్ర పిండాల పనితీరు దెబ్బతింటుంది.