Hot Tea: వేడి వేడి టీ తాగుతున్నారా.. అయితే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే?

చాలామందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 08:30 AM IST

చాలామందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. రోజులో ఒక్కసారి అయినా కాఫీ లేదా టీ తాగకపోతే పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. అయితే కాఫీ లేదా తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ మితిమీరి కాఫీలు టీలు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది రోజులో నాలుగైదు సార్లు టీలు కాఫీలు తాగుతూ ఉంటారు. ఇలా ఎక్కువసార్లు తాగడం వల్ల టీ కాఫీలలో ఉండే కెఫిన్ అనే పదార్థం ఆకలిని చంపేస్తుంది.

అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి టీ, కాఫీ లు ఆరోగ్యానికి మంచిది కానీ పరిమితికీ మించి తాగకూడదు. అయితే చాలామంది కాఫీలు టీలు తాగేవాళ్లు వేడివేడిగా ఉన్నప్పుడే తాగుతూ ఉంటారు. ఇంకొందరు కొంచెం చల్లగా అయిన తర్వాత తాగుతూ ఉంటారు. అయితే వేడి వేడి తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారు వైద్యులు. సాధారణంగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. అంతే కాకుండా చాలా వరకు లాభాలు ఉన్నాయి. కానీ టీ వేడి వేడిగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అయితే గోరువెచ్చని కాఫీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. గోరువెచ్చని, చల్లని కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15 శాతం తగ్గుతుంది. కేవలం టీ ఒక్కటే కాదు, కాఫీ గానీ, గ్రీన్ టీ తాగినా దాని టెంపరేచర్ తక్కువ ఉన్నపుడు మాత్రమే తాగాలి. టీలో ఉండే కాటెచిన్స్, థెఫ్లావిన్స్, థెరుబిగిన్స్ వంటి సమ్మేళనాలు అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్, గుండె సమస్యలతో పోరాడటానికి, డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించడానికి టీ సహాయపడుతుంది.