వేసవి (Summer) తాపాన్ని తగ్గించుకోవడానికి చాలామంది రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన చల్లని నీటిని(Cold Water) తాగుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం.. ఇది మన ఆరోగ్యానికి సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. శరీరం ఆకస్మికంగా చల్లని నీటిని తీసుకోలేకపోతుంది, దీని వలన తలనొప్పి, అలసట, ఒంటిలో నొప్పులు ఏర్పడే అవకాశం ఉంది. కొందరికి రక్తనాళాలు అకస్మాత్తుగా రక్తప్రసరణలో మార్పులు రావొచ్చు.
Telangana Budget 2025-26 : బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
చల్లటి నీటిని తరచూ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఎండలో నుంచి ఇంటికి వచ్చాక వెంటనే ఫ్రిజ్ నీటిని తాగితే గొంతులో మంట, జలుబు, గొంతు నొప్పి రావొచ్చు. మరీ ఎక్కువగా తాగితే దంతాలకు హాని కూడా కలుగవచ్చు.
Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని
వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మట్టికుండలో నిల్వ చేసిన నీరు తాగడం ఉత్తమం. ఇది సహజంగా గాఢ ఉష్ణోగ్రతకు సరిపోయే నీటి ఉష్ణోగ్రతను నిలుపుకుంటుంది. అదనంగా మట్టికుండ నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. అందుకే, వేసవి కాలంలో చల్లని నీటికి బదులుగా సహజమైన నీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.