Food: అన్నం తిన్న తర్వాత టీలు కాఫీలు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే టిఫిన్ తిన్న తర్వాత అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన

Published By: HashtagU Telugu Desk
Mixcollage 04 Feb 2024 08 12 Am 9374

Mixcollage 04 Feb 2024 08 12 Am 9374

మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే టిఫిన్ తిన్న తర్వాత అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత టీ కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలా టీ కాఫీలు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. పొద్దున లేవగానే ఒక టీ కడుపులో పడాల్సిందే. అప్పుడే నిద్ర గిద్ర అంతా మాయం అవుతుంది. అయితే టీ, కాఫీలను మోతాదులో తీసుకుంటే పెద్దగా వాటి వల్ల వచ్చిన నష్టమేమీ లేదు కానీ అతిగా తాగకూడదు. కొందరైతే టీ కాఫీలను ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంటారు. దానికి ఒక టైమ్ ఉండదు పాడు ఉండదు.

ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడే తాగేస్తుంటారు. అలా టీ,కాఫీలను ఎప్పుడు పడితే అప్పుడు తాగితే లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది టీకాఫీలను ఎక్కువగా భోజనం చేశాక అంటే మధ్యాహ్నం పూట భోజనం చేశాక వెంటనే టీ కాఫీలను తాగుతున్నారట. ఉదయం పూట టిఫిన్స్ చేశాక మనకు టీ కాఫీలను తాగడం అలవాటు. అలాగే మధ్యాహ్నం అన్నం తిన్నాక కూడా చాలామంది అలాగే టీ కాఫీలను తాగేస్తున్నారట. అన్నం తిన్న వెంటనే టీ కాఫీలను తాగడం అస్సలు మంచిది కాదు. వెంటనే టీ కాఫీలను తాగడంవల్ల మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించలేదు. అందుకే చాలామంది ఐరన్ సమస్య వస్తుంది.

ఎందుకంటే శరీరానికి కావాల్సిన ఐరన్ మనం తినే తిండి నుంచే వస్తుంది. ఆ తిండి తినగానే కాఫీలు, టీలు తాగితే ఐరన్ ను శరీరం గ్రహించుకోలేదు. దీంతో ఐరన్ లోపం రావడం, రక్త హీనత రావడం లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. చాలామందికి భోజనం చేయగానే ఏదో ఒకటి తాగాలనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే వేడి వేడిగా చాయ్, కాఫీ తాగుతారు. అటువంటి వాళ్లు ఏవైనా పండ్లరసాలను తాగడం మంచిది. ముఖ్యంగా విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. అప్పుడు శరీరం ఐరన్ ను బాగా గ్రహించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా భోం చేశాక టీ, కాఫీలు తాగాలంటే మాత్రం కనీసం రెండు గంటల గ్యాప్ ఇవ్వాలి. అన్నం తిన్న తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చి అప్పుడు టీ, కాఫీలను తాగాలి. ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అన్నం తినగానే టీ, కాఫీలను తాగడం మాత్రం మానేయాల్సిందే. లేదంటే విటమిన్ సీ ఎక్కువగా ఉండే జ్యూస్ లను ఎక్కువగా తాగండి.

  Last Updated: 04 Feb 2024, 08:12 AM IST