Site icon HashtagU Telugu

Chai + Cigarettes : ఛాయ్ తాగుతూ..సిగరెట్ తాగుతున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిందే

Chai + Cigarettes

Chai + Cigarettes

చలికాలంలో (Winter Season) చాలా మంది చాయ్‌ తాగుతూ (Chai + Cigarettes) వేడిని పెంచుకుంటుంటారు. మరికొందరు సిగరెట్ తాగుతూ ఛాయ్ తాగుంతుంటారు. ఇది ఆరోగ్యానికి తక్షణ ఉపశమనంలా అనిపించినా, దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. చాయ్‌లోని కెఫీన్ మరియు సిగరెట్‌లోని నికోటిన్ కలిసి ఆహారనాళం, మల విసర్జన, మరియు శరీరానికి సంబంధించిన అనేక సమస్యలకు దారితీస్తాయి.

చాయ్‌లో ఉన్న కెఫీన్ శరీరంలో డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. దీని వల్ల నీటిశాతం తగ్గి మల విసర్జన కష్టతరమవుతుంది. అధిక చాయ్ తాగడం వల్ల మలబద్ధకం, మూత్ర మార్గ సమస్యలు పెరుగుతాయి. కెఫీన్ శరీరం నుంచి నీటిని తొలగిస్తుండటంతో శరీరం తక్కువ సమర్థంగా పనిచేస్తుంది. సిగరెట్‌లోని నికోటిన్ నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలిక ధూమపానం వల్ల ఆహారనాళం కదలికలు అసమాన్యంగా మారుతాయి. నికోటిన్ వల్ల రక్త ప్రసరణ తగ్గిపోవడం, ఆంతర శరీర బ్యాక్టీరియాలో అసమతౌల్యం రావడం వంటి సమస్యలు ఎక్కువవుతాయి.

ఈ అలవాట్లను తగ్గించడం లేదా మానేయడం ఎంతో అవసరం. చాయ్‌ను పరిమితంగా తాగడం, రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీటిని తాగడం ద్వారా కెఫీన్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ధూమపానాన్ని పూర్తిగా మానుకోవడం, ఆహారంలో ఎక్కువ ఫైబర్‌ను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. చాయ్ మరియు సిగరెట్ కలయిక తక్షణ ఉపశమనంలా అనిపించినప్పటికీ, దీని దుష్ప్రభావాలు మరింత తీవ్రమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటినుంచే ఈ అలవాట్లను తగ్గించి, మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మంచిది.

Read Also : Allu Arjun : కాళ్లు మొక్కిన అల్లు అర్జున్