Site icon HashtagU Telugu

Health Tips: ఈ జ్యూస్ తాగితే చాలు.. బాణ లాంటి పొట్ట అయినా తగ్గాల్సిందే!

Health Tips

Health Tips

ఈ రోజుల్లో చాలామంది పురుషులు అలాగే స్త్రీలు పొట్ట సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పొట్ట పెంచడం ఈజీనే కానీ పొట్టను తగ్గించడం మాత్రం చాలా కష్టం అని చెప్పాలి. చాలా మంది పొట్టను తగ్గించడం కోసం బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్ ఫాలో అవడంతో పాటు ఎక్సర్సైజ్, జిమ్ కి వెళ్లడం అలాగే మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట మాత్రం తగ్గదు. దీంతో ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే జూస్ తాగితే చాలు బాణ లాంటి పొట్ట అయినా సరే ఈజీగా తగ్గిపోతుందట.

మరి అందుకోసం ఎలాంటి జ్యూస్ తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. మన వంటింట్లో దొరికే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి. ఈ క్యారెట్ ని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. వీటిని కొందరు కూరల్లో తినడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చిగా కూడా తింటూ ఉంటారు. వీటిలో ఎన్నో మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. క్యారెట్ లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం వృద్ధి చెంది రక్తహీనత తగ్గుతుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తొలగిపోయి జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యతకు ఆస్కారం ఉంటుంది.

అలాగే డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడేవారు పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ని కరిగించుకోవడం కోసం క్యారెట్ జ్యూస్ బాగా పని చేస్తుంది. క్యారెట్ లో విటమిన్ బి వన్, బి టు, బి సిక్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్లను, కొవ్వులను జీర్ణం అయ్యేలా చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే బిటమిన్ శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతుంది క్యాలరీలు వేగంగా ఖర్చు అవ్వటంతో కొవ్వు కరిగి బరువు బాగా తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బెల్లీ ప్యాట్ తగ్గాలి అనుకున్న వారు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు, పొట్ట తగ్గాలి అనుకున్న వారు తరచుగా క్యారెట్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుందట. క్యారెట్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికొస్తే.. ముందుగా క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత యాలకులు, పుదీనా వేసి మరొకసారి మిక్సీ చేసుకొని వచ్చిన నీటిని వడపోసుకోవాలి రుచి కోసం కొంచెం తేనె కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ ని రోజుకి ఒక గ్లాస్ చొప్పున టిఫిన్ చేసే సమయానికి ముందు తీసుకుంటే మంచిది.