Site icon HashtagU Telugu

Health Tips: ఈజీగా పొట్ట తగ్గాలంటే ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగాల్సిందే!

Health Tips

Health Tips

మన వంటింట్లో దొరికే కాయగూరలలో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. క్యారెట్ ను తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలను కూడా పొందవచ్చు. క్యారెట్ కేవలం కంటికి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. అయితే కొందరు క్యారెట్ ని పచ్చిగా తినడానికి ఇష్టపడితే మరి కొందరు కూరల రూపంలో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇకపోతే ఈ క్యారెట్ జ్యూస్ తో బాణా లాంటి పొట్ట అయినా సరే ఈజీగా కరిగించుకోవచ్చు అని చెబుతున్నారు.

క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తొలగిపోయి జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చట. క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యతకు ఆస్కారం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందట. అధిక బరువు సమస్యతో బాధపడేవారు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంది అని బాధపడేవారు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అందులో ఉండే విటమిన్ బి వన్, బి టు,బి సిక్స్ లు అధిక కొవ్వును కరిగించడంలో ఎంతో బాగా పనిచేస్తాయట.

ప్రోటీన్లను, కొవ్వులను జీర్ణం అయ్యేలా చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయిట. ఇందులో ఉండే బిటమిన్ శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతుంది క్యాలరీలు వేగంగా ఖర్చు అవ్వటంతో కొవ్వు కరిగి బరువు బాగా తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే క్యారెట్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత యాలకులు, పుదీనా వేసి మరొకసారి మిక్సీ చేసుకొని వచ్చిన నీటిని వడపోసుకోవాలి. రుచి కోసం కొంచెం తేనె కలుపుకోవచ్చు. ఈ జ్యూస్ ని రోజుకి ఒక గ్లాస్ చొప్పున టిఫిన్ చేసే సమయానికి ముందు తీసుకుంటే మంచిది. ఇందులో ఉండే ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్ లు రోగనిరోధక శక్తిని పెంపొందించి కొవ్వులని కరిగిస్తాయి. హైబీపీని కూడా అదుపులో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version