Site icon HashtagU Telugu

Drinking Alcohol: హ్యాంగోవర్ సమస్య ఉండకూడదంటే మద్యం సేవించే ముందు వీటిని తినాల్సిందే?

Mixcollage 31 Dec 2023 06 04 Pm 7105

Mixcollage 31 Dec 2023 06 04 Pm 7105

మామూలుగా మద్యం సేవించిన తర్వాత హ్యాంగోవర్ అవ్వడం అన్నది కామన్. మామూలుగా చెప్పాలి అంటే కిక్ ఎక్కింది,ఫుల్ అయ్యింది అని కూడా అంటూ ఉంటారు. కొంతమందికి కొన్ని కొన్ని సార్లు అనేక కారణాల వల్ల మద్యం సేవించిన తర్వాత వాంతులు కూడా అవుతూ ఉంటాయి. అయితే ఇలా మద్యం సేవించిన తర్వాతే హ్యాంగ్ ఓవర్ అవ్వకుండా వాంతులు అవ్వకుండా ఉండాలి అంటే మద్యం సేవించడానికి అంటే ముందు కొన్ని రకాల పదార్థాలు తినాలి అంటున్నారు నిపుణులు. మరి ఆల్కహాల్ సేవించే ముందు ఎటువంటి పదార్థాలు తినాలి అన్న విషయానికి వస్తే.. మద్యం సేవించేటప్పుడు ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఆల్కహాల్ ఎప్పుడూ ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు.

ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగినా, మద్యం సేవించేటప్పుడు మసాలాతో కూడిన ఆహారం తీసుకున్నా ఆరోగ్యం చెడిపోతుంది. మద్యం సేవించే ముందు ఉడికించిన కోడి గుడ్లు తినాలి. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొన తింటే జీర్ణం కావడానికి సహాయ పడుతుంది. ఆ తర్వాత మద్యం సేవించినా శరీరంపై పెద్దగా ప్రభావం ఉండదు. అలాగే మద్యం సేవించే ముందు మీరు ఓట్స్ తినవచ్చు. ఆల్కహాల్ శరీరానికి హానికరం కాబట్టి వోట్స్ తినడం వల్ల వీటిల్లోని ప్రొటీన్, ఫైబర్ సహా వివిధ పోషకాలు శరీరానికి ఉపయోగపడతాయి. వైన్ తాగేముందు అరటిపండ్లు తినాలి. అరటిపండులోని చక్కెరలు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. హ్యాంగోవర్‌ని సులభంగా నివారించవచ్చు.

వేయించిన చేపలను వైన్‌ తో తినవచ్చు. మద్యం సేవించే ముందు కూడా చేపలను తినవచ్చు. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది ఆల్కహాల్ శోషణ ప్రక్రియను తగ్గిస్తుంది. పెరుగు ప్రోటీన్, కొవ్వు, పిండి పదార్ధాలతో నిండి ఉంటుంది. పెరుగులోని ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఆల్కహాల్‌ను శరీరం శోషించడాన్ని నెమ్మదింప చేస్తుంది. ఆల్కహాల్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. చిలకడ దుంపలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. అలాగే, ఉడికించిన బంగాళాదుంప ఆధారిత భోజనం మద్యం సేవించడానికి ముందు తింటూ ఘన పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను నెమ్మదిస్తుంది.

Exit mobile version