Site icon HashtagU Telugu

Ghee: నెయ్యిలో వేడి నీటిని కలుపుకొని తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Ghee

Ghee

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యి తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడంతో పాటు అనేక సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. నెయ్యి తరచుగా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా కలుగుతాయి అని చెబుతున్నారు. చాలా వరకు నెయ్యిని స్వీట్లు తయారీలో ఉపయోగించడంతో పాటు భోజనం చేసేటప్పుడు కలుపుకొని తింటూ ఉంటారు. కాగా నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు.

ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయట. నెయ్యి వాతా, పిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుందట. నెయ్యిని ఆహారంలో భాగంగా కాకుండా వేడి నీటిలో నెయ్యి వేసుకొని ఎప్పుడైనా తీసుకున్నారా? అలా తీసుకుంటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేడి నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే జీవక్రియ మెరుగుపడుతుందట. అలాగే మీ శక్తి పెరుగుతుందట. గుండె, మెదడు ఆరోగ్యం బాగుంటుందని, వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు సజావుగా సాగుతాయని, నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ పొట్టలో జీవక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట.

ఇది మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే నాడీ వ్యవస్థలో మంచి మార్పు వస్తుందట. ఇది ఆందోళనతో సహా మెదడును ప్రభావితం చేసే ఇతర జబ్బుల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆవు నెయ్యి తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందట. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ ,విటమిన్ కె వంటి కొవ్వులో కరిగే విటమిన్ల శోషణకు అవసరమైన మంచి కొవ్వులను నెయ్యి మన శరీరంలో ఉంచుతుందని, నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో సహాయపడుతుందని, అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా నెయ్యి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. చర్మానికి గ్లో ఇస్తుందని, నెయ్యిలో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయని, చర్మం పొడి బారకుండా పోవడానికి వేడినీళ్లలో నెయ్యి కలిపి తాగుతూ ఉండవచ్చని చెబుతున్నారు. వేడినీటిలో నెయ్యి వేసుకుని తాగి వారు ఈ డ్రింక్ ని ఉదయాన్నే తాగడం మంచిది. ఉదయం తాగితే ఎక్కువగా పని చేస్తుందట. 200 ml వేడి నీటిని తీసుకుని దానికి 1 చెంచా నెయ్యి లేదా వెన్న కలిపి పరగడుపున తాగితే సరిపోతుందట.