మన చుట్టూ ఉన్నవారిలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. మీ రక్తహీనత సమస్య కారణంగా శరీరం అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ రక్తహీనత సమస్య క్రమంగా ఎక్కువ అయితే మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి గోర్లు పాలిపోవడం, నాలుక, కనురెప్పల కింద తెల్లగా ఉండడం, చిన్న చిన్న పనులకే అలసిపోవడం, బలహీనంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి పండ్లు అలాగే కూరగాయల జ్యూస్ లు తీసుకోవడం మంచిది. మరి ఎటువంటి జ్యూస్ లు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రక్తహీనత సమస్యను తగ్గించుకోవడంలో ద్రాక్ష జ్యూస్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు కప్పుల ద్రాక్ష, పావు కప్పు పంచదార,చిటికెడు ఉప్పు,కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని వడగట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకొని తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం రెండు కప్పుల బీట్ రూట్, పావు కప్పు పంచదార, చిన్న అల్లం ముక్క, చిటికెడు ఉప్పు కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని వడగట్టుకుని ఒక గ్లాసులో వడకట్టుకునే కొద్దిగా నిమ్మరసం మీకు కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగవచ్చు.
అయితే చాలామంది బీట్ రూట్ వాసనను ఇష్టపడరు. అటువంటి వారు క్యారెట్ ని కూడా కలుపుకుని తీసుకోవచ్చు. అలాగే దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం రెండు కప్పుల దానిమ్మ గింజలు ఒక టేబుల్ స్పూన్ పంచదార కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని వడగట్టుకుని తాగాలి. కావాలి అనుకున్న వారు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.