Site icon HashtagU Telugu

Chia Seeds: చియా గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 31 Dec 2023 02 44 Pm 8679

Mixcollage 31 Dec 2023 02 44 Pm 8679

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాగా రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా షుగర్ అదుపులో ఉండకపోతే షుగర్ పేషెంట్లు చియా సీడ్స్ ని తీసుకోవాల్సిందే. చియా గింజలు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడతాయి.

ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉండి అచ్చం సబ్జా గింజలు మాదిరిగానే ఉంటాయి. చియా గింజలను నీటిలో వేయగానే వెంటనే ఉబ్బుతాయి. వీటిని ఇలా నానబెట్టుకొని రోజు తాగవచ్చు. ఇలా తాగితే దీనివలన రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొంతమందికి ఇన్సులిన్ తగినట్లుగా ఉత్పత్తి జరగక రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఈ షుగర్ లెవెల్స్ సరియైన మోతాదులో ఉత్పత్తి అవ్వాలి. అంటే ఈ ఆ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి తీసుకున్నప్పుడు మన ప్రేగులలో ఎండ్రో క్లినిక్ సేల్స్ ద్వారా జిఎల్పి వన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకని ప్యాంక్రియాస్ సిమిలేట్ చేయడానికి జి ఎల్ పి వన్ బాగా ఉపయోగపడుతుంది.

అలాగే రెండోది ఈ చియా గింజలలో 34.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీనివలన ప్రేగులలో ఉన్న ఫుడ్ నుండి రిలీజ్ అయిన గ్లూకోజ్ ను రక్తంలోకి వెళ్లకుండా ఆపివేస్తుంది. ఈ చియా గింజలలో కూరగాయలను పోల్చి చూస్తే ఆరు రెట్లు ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివలన గ్లూకోజ్ దానంతట అదే ఉత్పత్తి అవుతుంది. అలాగే కంట్రోల్ కూడా అవుతుంది. అలాగే ఇంకొక లాభం ఈ ఫైబర్ 20 గ్రాముల సాలిబుల్ ఫైబర్ ప్రేగులలో ఉండే బ్యాక్టీరియాను, పెరగడానికి అలాగే ఆరోగ్యంగా ఉంచటానికి ఈ మంచి బ్యాక్టీరియా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చియా గింజలు ఒక గ్లాసు నీటిలో నానబెట్టుకొని ప్రతిరోజు భోజనానికి ముందు త్రాగాలి. ఇలా త్రాగడం వలన మధుమేహం తప్పకుండా తగ్గించుకోవచ్చు. ఇక మీరు వాడే మందులు తీసుకెళ్లి చెత్తబుట్టలు పడి వేయొచ్చు.