Site icon HashtagU Telugu

Oral Health: నీళ్లు తాగకపోతే పళ్ళు పుచ్చిపోతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Oral Health

Oral Health

మనిషికి నీరు ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ఆహారం లేకుండా అయినా జీవించవచ్చు కానీ నీరు తాగకుండా జీవించడం మనది చాలా కష్టం. అందుకే వైద్యులు శరీరానికి సరిపడా నీళ్లు తాగమని చెబుతూ ఉంటారు. శరీరానికి సరిపడా నీరు తాగక పోయినప్పుడు ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తాయి. నోటి పొడి పులి బారడం డీహైడ్రేషన్ కు గురి కావడం ఇలా ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే నీళ్లు తాగకపోతే చాలామంది పళ్ళు పుచ్చిపోతాయి. దంత సమస్యలు వస్తాయి నోటికి సంబంధించిన సమస్యలు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నోటి పరిశుభ్రత కోసం తగినన్ని నీటిని తీసుకోవాలి. నోటిని తేమగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. లాలాజల ఉత్పత్తికి సహకరిస్తుంది. అలాగే నోటి కుహరాన్ని కూడా శుభ్రపరుస్తుంది. లాలాజలం దంతాల పునరుద్ధరణలో సహాయపడుతుంది. బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే ఆమ్లాలని తటస్థీకరిస్తుంది. డీహైడ్రేషన్ నోటి కణజాలం పొడిబారిపోయేలా చేస్తుంది. దాని వల్ల దుర్వాసన, దంత క్షయం, చిగుళ్ళ వ్యాధి వంటి నోటి ఆరోగ్య సమస్యల్ని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే హైడ్రేట్ గా ఉండాలి. అప్పుడే ఈ సమస్యలేవీ మనల్ని ఇబ్బంది పెట్టకుండ ఉంటాయి.అలాగే నోటిలోని యాసిడ్ స్థాయిలని తగ్గించడంలో నీరు సహాయపడుతుంది. ఆమ్ల వాతావరణం దంతాల మీద ఉండే ఎనమిల్‌ను క్షీణింపజేస్తుంది. దంతాలు సున్నితత్వం మారిపోతాయి.

పుచ్చు పట్టే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా నీరు తీసుకోవడం వల్ల నోటిలో pH స్థాయిని కాపాడుకోవచ్చు. దంతాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. నీరు తాగడం వల్ల నోట్లో పేరుకుపోయిన ఆహార కణాలు, బ్యాక్టీరియా ఫలకాలు ఫ్లష్ చేయబడతాయి. అవి పోవడం వల్ల దంత క్షయం, చిగుళ్ళ వ్యాధి, నోటి దుర్వాసన ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు తాగకపోతే దంతాలు, చిగుళ్ళ మీద బ్యాక్టీరియా పేరుకుపోతుంది. జిరోస్టోమియా అనేది లాలాజలం ఉత్పత్తి తగ్గడం వల్ల ఏర్పడే పరిస్థితి. నిర్జలీకరణం, కొన్ని మందులు, వైద్య పరిస్థితులు వంటి కారణాల వల్ల సంభవిస్తుంది. దంత క్షయం, చిగుళ్ళ వ్యాధితో సహ దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నీరు తాగితే నోరు పొడబారిపోకుండా ఉంటుంది. నోటిని తేమగా ఉంచుతుంది.

Exit mobile version