Site icon HashtagU Telugu

Health Tips: ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 25 Dec 2023 05 08 Pm 7074

Mixcollage 25 Dec 2023 05 08 Pm 7074

ఈ రోజుల్లో చాలామంది మినరల్ వాటర్ అంటూ మామూలు నీళ్ల కంటే బాటల్స్ లో వచ్చే నీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బయట చాలా వరకు మనకు చిన్న చిన్న బాటల్స్ నుంచే ఈ వాటర్ బాటిల్స్ లభిస్తూ ఉంటాయి. అయితే అలా ప్లాస్టిక్ ఉపయోగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ప్లాస్టిక్ బాటిల్స్ తో నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్లాస్టిక్ అనేది ఒక పాలిమర్. ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయి.

అంతేకాకుండా ప్లాస్టిక్ లో బిపి అనే కెమికల్ ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా హాని చేస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే రసాయనాలు పాలిమర్లలో ఉండే మూలకాలు శరీరంలోకి వెళితే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగితే చాలా తీవ్రమైన వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా పురుషులకు హార్మోన్ సమస్యలు వస్తాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడంతో కాలేయానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇక మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ప్లాస్టిక్ బాటిల్ లో ఉంచిన నీటిని తాగుతారు.

అంతేకాదు నీటితో నింపిన బాటిల్స్ ను ఎక్కువ రోజులు ఫ్రిజ్లో పెట్టి తాగుతుంటారు. ఇలా చేయడం వలన ప్లాస్టిక్ బాటిల్లో ఉండే డిపిఏ ఇతర రసాయనాలు శరీరంలోకి వెళతాయి. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ బదులుగా రాగి పాత్రలు వాడితే మంచిది. మన పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలను ఉపయోగించేవారు. రాగిలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.