టీ ప్రియులు చాలామంది అల్లం టీ తాగడానికి ఇష్టపడరు. మరి ముఖ్యంగా వర్షాకాలంలో చలికాలంలో అల్లం టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. మరికొందరు సీజన్ తో సంబంధం లేకుండా టీ చేసుకునేటప్పుడు అల్లం కొద్దిగా యాలకులు వేసుకొని తాగుతూ ఉంటారు. కనీసం రోజుకి ఒక్కసారైనా టీ తాగకపోతే ఏదో కోల్పోయిన వారిలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇకపోతే అల్లం టీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అల్లం టీ తాగడం మంచిదే కానీ ఈరోజు తాగవచ్చా పరగడుపున తాగవచ్చా తాగితే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అల్లం టీ లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీ లతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఈ విధంగా చూసుకుంటే అల్లం ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో అల్లం టీ మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ, మీరు పాలు, టీ ఆకులను కలిపి తయారు చేయకూడదుట. ఈ రకం టీ మాత్రం ఏ మాత్రం ఆరోగ్యకరం కాదని, దీని వల్ల ఉపయోగాలు లేకపోగా నష్టాలు కలిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట. మీరు అల్లం నీటిలో ఉడకబెట్టాలి.
దీన్ని ఫిల్టర్ చేసి, గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత, తేనె లేదా నిమ్మరసం జోడించి తాగాలని చెబుతున్నారు. ఈ టీ గుణాలతో నిండి,అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయని, అల్లం హెర్బల్ టీ జీవక్రియను పెంచుతుందని దాని వినియోగం బరువు తగ్గడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. పాలకు బదులుగా పైన చెప్పిన విధంగా అల్లం టీ చేసుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయిట.
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందట. రోగాలను దూరం చేస్తుందని చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అని చెబుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం టీ తాగడం వల్ల ముఖంలో మెరుపు వస్తుందట. మొటిమలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఇలా అల్లం టీ తాగడం వల్ల మేలు కలుగుతుందని చెబుతున్నారు. కానీ ఎక్కువ మోతాదులో తాగకూడదట. ఇది కాకుండా, ఉదయం పూట పాలు, టీ ఆకులతో అల్లం టీ ఆరోగ్యానికి హానికరం అని, ఇది గ్యాస్, అసిడిటీకి కారణమవుతుందని చెబుతున్నారు.