నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. నెయ్యి తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చాలామందికి నెయ్యి అంటే చాలా ఇష్టం. అందుకే వివిధ రూపాలలో నెయ్యిని తీసుకుంటూ ఉంటారు. నెయ్యి ఆహారానికి రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న నెయ్యిని ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడం నుండి చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుందట.
ఇది జలుబు, దగ్గు సమస్యను కూడా తొలగించడానికి సహాయపడుతుందట. చ నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయట. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుందట. అంతేకాకుండా జుట్టు బలంగా, మందంగా పెరగడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల చర్మ రంగు మెరుగుపడుతుందట. జుట్టు రాలడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ బలోపేతం నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ ప్రక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది పేగు మంటను తగ్గిస్తుందని,జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చట. ఇది ప్రేగులను శుభ్రపరచడం ద్వారా శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీర జీవక్రియను పెంచుతాయి, ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుందట. గోరు వెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుందట. ఇది శరీరానికి శక్తిని అందిస్తుందని, ఆకలిని నియంత్రిస్తుందని చెబుతున్నారు. తద్వారా అదుపులేని ఆహారపు అలవాట్లను నివారిస్తుందట..హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుందట. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయట. నెయ్యి స్త్రీలలో రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుందని,హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయట. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి బలాన్ని ఇస్తుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో వేడిని నిర్వహిస్తుందట. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తుందట. మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరం నెయ్యిలో ఉండే ఒమేగా3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మెదడుకు చాలా మేలు చేస్తాయని, ఇది జ్ఞాపకశక్తిని పదునుపెడుతుందని, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.