Site icon HashtagU Telugu

Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

Thyroid

Thyroid

మామూలుగా స్త్రీలు గర్భిణీగా ఉన్న సమయంలో పలు రకాల టెస్టులు చేయించుకోమని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో థైరాయిడ్ చెకప్ కూడా ఒకటి. తప్పనిసరిగా థైరాయిడ్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తూ ఉంటారు. చాలా మందికి గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య ఉంటుంది. కానీ ఇది తల్లి, ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. అందుకే ఈ సమయంలో వీళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే ఒకవేళ గర్భిణీ స్త్రీలకు థైరాయిడ్ సమస్య ఉంటే అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

9 నెలలు గర్భంతో ఉన్న ఆడవాళ్లకు వారి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు చాలా సున్నితమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వారి ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా స్త్రీలకు శారీరక సమస్యలు ఉంటే ఈ సమయంలో ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయట. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య ఉంటే అది కడుపులోని బిడ్డకు ప్రమాదం కలిగిస్తుందట. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్ల శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల చాలా మంది ఆడవాళ్లు థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భధారణ సమయంలో డాక్టర్లు థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. అలాగే మీకు ఇప్పటికే థైరాయిడ్ సమస్య ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి.

దీంతో థైరాయిడ్ మందులను వాడాలి. సరైన చికిత్స చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ ను తీసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటించాలట. హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నవారు ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూసుకోవాలట. అలాగే వీలైనంతవరకు కూరగాయలు పండ్లు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పు, తృణధాన్యాలు చేర్చుకోవాలట. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ ను నియంత్రించడానికి డాక్టర్లు మందులను సిఫారసు చేస్తారు.

అందుకే డాక్టర్ సూచించిన విధంగా మందులను మోతాదులోనే తీసుకోవాలి. అలాగే మీకు మీరే మందుల్లో మార్పులు చేసుకోకూడదట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది పుట్టబోయే బిడ్డ శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. అలాగే గర్భిణీ స్త్రీలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు టెన్షన్ పడకుండా ఎల్లప్పుడూ మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలట. ఎందుకంటే ఒత్తిడి థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతుందని చెబుతున్నారు. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ వైద్యులు సూచించిన మందులు వేసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

note: పైన చెప్పిన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేమకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.