ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ (mobile phone) ఉంటోంది. మొబైల్ ఉంది అంటే దానికి ఇయర్ ఫోన్స్ (earphones), ఇయర్ బడ్స్ (ear buds) ఏదో ఒకటి కనెక్ట్ చేసి పాటలు వినని వాళ్ళు ఉండనే ఉండరు. కాల్స్ మాట్లాడటానికి కూడా చాలామంది వీటినే వినియోగిస్తారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిజానికి రేడియేషన్(Radiation) తగ్గించడానికి ఇయర్ ఫోన్స్ వాడకం మంచిదే అయితే వాటిని మరీ ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం సమస్యలు తప్పవు.
ఇయర్ ఫోన్స్ లో ఎక్కువ సేపు పాటలు వినడం, ఫోన్ మాట్లాడటం వంటి చేస్తుంటే వినికిడి సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కొంతమందికి ఎక్కువ సేపు చెవిలో ఇయర్ బడ్స్ ఉండటం వల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. మన వాళ్ళే కదా అని మీ ఇయర్ ఫోన్స్ ఇతరులతో పంచుకోకండి. ఇలా చేయడం వల్ల ఇయర్‌ఫోన్ ద్వారా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అది ఇన్‌ఫెక్షన్ కూడా వ్యాపింపజేస్తుంది.
అలాగే హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల వినికిడి శక్తి తగ్గుతుంది. దీనివల్ల దూరం నుంచి వచ్చే శబ్దాలు వినడంలో సమస్యలు వస్తాయి. అలాగే హెడ్ ఫోన్స్ లో సౌండ్ బయట శబ్దాలు వినపడనంతగా ఉన్నా, అసలు 60 శాతం దాటినా చాలు వీలైనంత త్వరగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వైబ్రేషన్ కారణంగా వినికిడి కణాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి. హెడ్‌ఫోన్స్‌ని ఎక్కువ సేపు ఉపయోగిస్తే మెదడుపై ప్రభావం పడుతుంది. వీటి నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు వీటివల్ల శారీరక సమస్యలు, గుండె జబ్బులు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ఇది హృదయ స్పందన రేటును వేగవంతం చేస్తుంది.
వీటన్నింటిని బట్టి చూస్తే ఇయర్ ఫోన్స్, వాటి అనుబంధ పరికరాలు ఎక్కువగా వాడకపోవడమే మంచింది. కానీ వాడక తప్పని స్థితిలో ఉన్నాం కాబట్టి దానికి ఒక పరిమితి విధించుకుందాం. 60 నిమిషాల కంటే ఎక్కువ ఇయర్‌ఫోన్‌లు వాడకుండా ఉండటమే మంచిది. లేదు మీరీ తప్పని సరి పరిస్థితి అయితే ప్రతి 30 నిమిషాల తర్వాత మీ చెవులకు కాస్త విశ్రాంతి ఇవ్వండి. అలాగే తరచుగా వాల్యూమ్‌ని తనిఖీ చేసుకోండి. ఎందుకంటే శ్రుతి మించితే సమస్యలు తప్పవు.
Also Read : ITR Refund: ITR ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం వేచి చూస్తున్నారా? అయితే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..?