Site icon HashtagU Telugu

కోడిగుడ్డు తినేటప్పుడు పొరపాటున కూడా ఈ రెండు తప్పులు అస్సలు చేయకండి?

Don't Make These Two Mistakes Even By Mistake While Eating Chicken Eggs..

Don't Make These Two Mistakes Even By Mistake While Eating Chicken Eggs..

కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్డులో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అయితే కోడి గుడ్డును (Eggs) తినడం మంచిది కానీ, కోడిగుడ్డు తినేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. కోడి గుడ్డులో విటమిన్ సి తప్ప మిగతా విటమిన్స్ అన్ని ఉన్నాయి.

We’re Now on WhatsApp. Click to Join.

ఉదయం పూట ప్రతి రోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యం బాగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే ప్రతిరోజు కోడి గుడ్డు (Eggs) తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా వరకు మనకు మార్కెట్లో ఎక్కువగా పారం కోడిగుడ్లే ఎక్కువగా లభిస్తున్నాయి. నాటి కోడిగుడ్లు చాలా తక్కువగా మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి. ఈ రెండింటిలో ఏది మంచిది అంటే రెండింటిలో ఏది తీసుకున్నా మంచిదే కానీ నాటి కోడిగుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో ఎక్కువగా కల్తీ కోడిగుడ్లను అమ్ముతున్నారు.

ఎందుకంటే ఫారం కోళ్లను ఇంజక్షన్లు మందులు ఇచ్చి పెంచుతారు కానీ నాటు కోళ్లు ఏది పడితే అది తింటూ బయట తిరుగుతూ తిరుగుతాయి. అందుకే నాటు కోడి గుడ్డులో (Eggs)నే ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. ఇది కణాలు వృద్ధి చెందించి అలాగే మెదడు పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇవి వాటిలోని చేదు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. గుడ్డు తింటే బరువు పెరగరు. అలాగే అన్ని రకాల పోషక విలువలు మనకు అందుతాయి. మరి గుడ్డు రోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన చిన్న వయసు నుంచే రోగాల బారిన పడుతున్నారు. మీరు చూసే ఉంటారు. చిన్న వయసు వారికి కూడా షుగర్లు బీపీలు గుండె జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం రోజు గుడ్డు తిన్నట్టు అయితే ఇలాంటి వాటిని మనం అరికట్టవచ్చు. అంతేకాదు మన పిల్లలకు కూడా చిన్నప్పటినుండి గుడ్డుని అలవాటు చేస్తే వారిలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

Also Read:  Mulugu Seethakka : నన్ను గెలిపించండి..మంత్రినై మీకు మరింత సేవ చేస్తా – ములుగు సీతక్క