Site icon HashtagU Telugu

Kissing Pets : పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త..

Pets

Dont Kissing your Pets it causes Health Issues

చాలా మంది తమ ఇళ్ళల్లో ఎక్కువగా పిల్లులు(Cats), కుక్కలను(Dogs) పెంపుడు జంతువులుగా(Pets) పెంచుకుంటున్నారు. అయితే వాటిని తమతో పాటు సమానంగా మరియు వాటిని తమతో పాటు పడుకోబెట్టుకుంటున్నారు. కానీ మనం ఎంత నీట్ గా చూసినా అవి నేల మీద మట్టిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఎంత బాగా చూసుకున్నా పర్వాలేదు కానీ వాటికి ముద్దులు పెట్టడం వంటివి చేయకూడదు.

పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవడం వలన వాటిపై ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి వాటికి ముద్దులు పెట్టకూడదు. ఎక్కువగా ముద్దులు పెట్టడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పెంపుడు జంతువులు నేల పైన ఎక్కువగా దొర్లడం, వాటి యొక్క లాలాజలం నేలపై పడిన మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవడం వలన ప్లేగు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

వాటిని ముద్దు పెట్టుకోవడం వలన చిగుళ్ళ వ్యాధి వస్తుంది. నోటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇంకా పెంపుడు జంతువులతో పాటుగా పడుకోవడం వలన దురద, అలర్జీ వంటివి వస్తాయి. ఇతర చర్మ సమస్యలు వస్తాయి. పెంపుడు జంతువుల వలన బ్యాక్టీరియా, వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పెంపుడు జంతువులను ఎంత బాగా మనం చూసుకున్నా వాటికి తెలియకుండా మన ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి.

 

Also Read : Food in Periods : పీరియడ్స్ సమయంలో మహిళలు తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..