Refrigerator: ఫ్రిడ్జ్ లో పొరపాటున కూడా వీటిని అస్సలు పెట్టకండి.. పెట్టారో అంతే సంగతులు?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో రిఫ్రిజిరేటర్ ను తప్పకుండా వినియోగిస్తున్నారు. అనేక రకాల ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఈ ఫ్రిడ

  • Written By:
  • Publish Date - June 23, 2024 / 02:36 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో రిఫ్రిజిరేటర్ ను తప్పకుండా వినియోగిస్తున్నారు. అనేక రకాల ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఈ ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్రిడ్జ్ ఉపయోగించడం మంచిదే కానీ చాలామంది ఇందులో ఏవి పడితే ఆ ఆహార పదార్థాలను నిల్వ చేస్తూ ఉంటారు. నిత్యం మనం ఉపయోగించే అనేక కూరగాయలను, ఆకుకూరలను, పండ్లను, ఆహార పదార్థాలను పెడుతూ ఉంటారు. అయితే చాలా ఆహార పదార్థాలు ఫ్రిజ్లో పెడితే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ లక్షణాలు పోతాయని, వాటిని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా కొన్ని రకాల వాటిని ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడదు అంటున్నారు.

ఇంతకీ ఫ్రిజ్ లో ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రిఫ్రిజిరేటర్ లలో కీరదోసకాయను పెట్టకూడదు. కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ మనం కీరదోసకాయను రిఫ్రిజిరేటర్ లో పెడతామో దానిలో ఉన్న నీటి శాతం తగ్గిపోయి చేదుగా మారుతుంది. అంతేకాదు గుమ్మడికాయ, సొరకాయ వంటి కూరగాయలలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వాటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల వాటిలో ఉండే నీటి శాతం తగ్గిపోతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద తింటే మాత్రమే ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక చాలామంది రిఫ్రిజిరేటర్ లలో ఉల్లిగడ్డలు, వెల్లి గడ్డలు కూడా పెడుతూ ఉంటారు.

కానీ రిఫ్రిజిరేటర్ లో ఉల్లిగడ్డలను పెట్టడం వల్ల అవి తేమను గ్రహించి మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉల్లిగడ్డలను పెట్టడం మంచిది కాదు. వెల్లుల్లిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల రుచి తగ్గిపోతుంది. అంతేకాదు వెల్లుల్లి కూడా మొలకెత్తే ప్రమాదం ఉంటుంది. వెల్లుల్లి కుళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద, బహిరంగ ప్రదేశాలలో వీటిని ఉంచాలి. పొరపాటున కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు. చాలామంది బంగాళదుంపలను ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. ఇలా చేస్తే బంగాళాదుంపలకు మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇక పండ్లలో అరటిపండ్లను కూడా కొంతమంది ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. పండ్లలో ముఖ్యంగా అరటిపండును బయటే ఉంచి తినాలి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ ఆపిల్ నారింజ బొప్పాయి వంటి పండ్లను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటిలో ఉన్న నీటి శాతం తగ్గిపోయి అవి పొడిపొడిగా చప్పగా అనిపిస్తూ ఉంటాయి.