Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉంటే టమాట తినకూడదు..క్యాల్షియం అధికంగా తీసుకోకూడదు…ఇవన్నీ ఫేక్…అసలు విషయం తెలుసుకోండి..!!

కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి! ఏవి తినకూడదు!!ఏవి తినాలి!! కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే ఎలాంటి పానీయాలు తాగాలి!!

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 08:29 AM IST

కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి! ఏవి తినకూడదు!!ఏవి తినాలి!! కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే ఎలాంటి పానీయాలు తాగాలి!! ఇలాంటి విషయాలు చాలా వినే ఉంటాయి! కిడ్నీలో రాళ్ల గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కిడ్నీలో రాళ్లు ఉంటే వెన్ను నొప్పి బాధిస్తుంది:
కిడ్నీ లోపల రాళ్ళు ఉంటే దాదాపు నొప్పి ఉండదు. కానీ మూత్రాశయ అవరోధం, మూత్ర నాళం అడ్డంకి నుండి వెన్ను ఒత్తిడి కారణంగా మూత్రపిండాల వాపు ఏర్పడుతుంది. చాలామందికి వికారం లేదా వాంతులతో తీవ్రమైన నొప్పి వస్తుందని చెబుతుంటారు. అప్పుడప్పుడు, మూత్రంలో రక్తం, మూత్రంలో మంటలు కూడా వస్తుంది అంటుంటారు.

టమోటాలు తినకూడదు:
కిడ్నీలో రాళ్లు ఉంటే టమోటాలు తినకూడదని చెప్పడం అబద్ధం. అయితే రక్తంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే టమోటాలు తినకూడదు. కాకపోతే టొమాటోలు ఇతర సీడ్ వెజిటేబుల్స్ తగిన మోతాదులో తీసుకోవాలి. కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే పుష్కలంగా పానీయాలు ఎక్కువగా తాగాలి.

కాల్షియం తీసుకోవద్దు:
సాధారణ స్థాయిలో ఆహారంలో కాల్షియం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. కాబట్టి, పాలు లేదా పాల పొడక్ట్స్ ను మితంగా తీసుకోవాలి. కాల్షియం తగ్గించడం వల్ల ఎముక డీ-మినరలైజేషన్, ఆక్సలేట్ శోషణ పెరుగుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పాడేందుకు దారితీస్తుంది. కాబట్టి కాల్షియం, పాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

మందులు కిడ్నీ రాళ్లను కరిగించగలవు:
తక్కువ శాతం మంది రోగులలో, రాళ్లు యూరిక్ యాసిడ్ లేదా సిస్టీన్‌తో ఉంటే, రాళ్లను కరిగించేందుకు మందులు వాడవచ్చు. కిడ్నీలో చాలా వరకు కాల్షియం ఆక్సలేట్ లేదా ఫాస్పేట్ వల్ల రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్నగా ఉంటే మందులతో కరిగించవచ్చు. పెద్దగా ఉంటే మందులతో కరగలేవు. వాటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి వస్తుంది.

బార్లీ నీరు, క్రాన్బెర్రీ జ్యూస్ :
బార్లీ వాటర్, క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు బయటకు వస్తాయని వినే ఉంటారు. కానీ ఇది అబద్ధం. ఎందుకంటే రాళ్ల నివారణ లేదా క్లియరెన్స్ కోసం బార్లీకి నిర్ధిష్ట ఆధారాలేమి లేవు. క్రాన్బెర్రీ జ్యూస్ తరచుగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుుతుంది. ఇది రాళ్లను తొలగించడంలో సహాయం చేయదు. రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. చాలా వరకు ద్రవాలతోనే కిడ్నీలో ఎదైనా ఇన్ఫెక్షన్ కానీ..రాళ్లు కానీ ఉంటే మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి. అయితే కిడ్నీల్లో రాళ్లకు కారణమయ్యే లవణాల సాంద్రతను తగ్గించుకునే ప్రయత్నం చేయలి. నిజానికి నిమ్మరసం, సిట్రస్ పానీయాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి.