Site icon HashtagU Telugu

Mango: మామిడిపండు తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త!

Mango

Mango

మామూలుగా సమ్మర్ సీజన్ మొదలయింది అంటే చాలు మార్కెట్లో మనకు బోలెడన్ని మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. మామిడిపండ్లలో కూడా ఎన్నో రకాల మామిడి పండ్లు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తూ ఉంటారు. అయితే మామిడి పండ్లు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మామిడిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. దీనిని మితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు పొందవచ్చు. పరిమితికి మించి తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు.

మామిడి పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు మన జీర్ణక్రియను మెరుగుపరిచే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైములు కూడా మామిడి పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇక అటువంటి మామిడి పండ్లను తింటున్న వారు మామిడి పండ్లు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉంటేనే మంచిది. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడిపండు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదట. మామిడి పండ్లతో పాల పదార్థాలను తీసుకోకుండా ఉంటేనే మంచిదట. పాలు, పెరుగు, మజ్జిగ, శీతల పానీయాలు, మామిడి స్మూతీలు వంటివి తీసుకోకూడదట.

మామిడి పండ్లను తిన్న తర్వాత వీటిని తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందట. ఇవి జీర్ణక్రియను నిదానింపజేసి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయట. చాలామంది మ్యాంగో లస్సి తాగేటప్పుడు పెరుగు కలుపుకుని తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని చెబుతున్నారు.
కాగా మామిడి పండ్లను తినేవారు మామిడి పండ్లతో చీజ్ తినడం మంచిది కాదని చెబుతున్నారు. మామిడిపండు తిన్న తర్వాత బాగా వేడిగా ఉండే ఆహారాన్ని కానీ మసాలాతో చేసిన ఆహారాన్ని కానీ తినకూడదట. మామిడిపండు తిన్న తర్వాత మళ్లీ ఇతర పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలు వస్తాయట. అదేవిధంగా మామిడిపండు తిన్న తర్వాత వెంటనే నిద్రపోతే కూడా జీర్ణక్రియలో ఇబ్బందులు వస్తాయట. తిన్న తర్వాత నిద్రకు ముందు ఒక అరగంట సమయమైనా గ్యాప్ ఉండాలని చెబుతున్నారు. అలాగే మామిడిపండు తిన్న తర్వాత 30 నిమిషాల నుండి ఒక గంట వరకు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదట. మామిడి పండు తిన్న తర్వాత బరువులు ఎత్తడం, శారీరక వ్యాయామాలు చేయడం వంటిది మంచిది కాదట.