Health tips : ముల్లంగితో కలిపి పొరపాటునా ఇవి తినకండి…విషంతో సమానం..!!

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 09:46 PM IST

శీతాకాలంలో ముల్లంగి పుష్కలంగా లభ్యం అవుతుంది. ముల్లంగిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సలాడ్ లో కానీ కర్రీ రూపంలో తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ముల్లంగిలో విటమిన్ ఎ, బి, సి తోపాటు ప్రొటీన్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ముల్లంగితో కలిపి కొన్ని కూరగాయలు తినకూడదని మీకు తెలుసా.

కాకరకాయ
మీరు ముల్లంగిని కాకరకాయతో కలిపి తినకండి. ఎందుకంటే ఈ రెండింటిలో ఉన్న సహజ మూలకాలు ఒకదానితో ఒకటి పరస్పర చర్యల వల్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. గుండె కు కూడా చాలా ప్రమాదకరం.

దోసకాయ
చాలామంది సలాడ్ దోసకాయను, ముల్లంగిని చేర్చుతుంటారు. కానీ దోసకాయతోపాటు ముల్లంగిని తినకూడదు. ఎందుకంటే దోసకాయలో ఆస్కార్బేట్ ఉటుంది. ఇది విటమిన్ సిని గ్రహిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఈ రెండింటిని కలిపి తినకూడదు.

నారింజ
నారింజ, ముల్లంగి కలిపి తినకూడదు. ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఈ రెండింటి కలయిక విషం లాంటిది.

పాలు.
ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఇలా తాగినట్లయితే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముల్లంగి తిన్న దాదాపు గంట తర్వాత పాలు తాగడం మంచిది.