Gooseberry : ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఉసిరికాయను తినవద్దు..

ఉసిరికాయ(Amla)ను కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడేవారు తినకూడదు.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 10:30 PM IST

ఉసిరికాయ(Gooseberry)లో అన్ని రకాల పోషకాలు, రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్లు ఉన్నాయి. కానీ ఉసిరికాయ(Amla)ను కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడేవారు తినకూడదు. వారు తింటే వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఇంకా పెరుగుతాయి.

* అసిడిటీ ఎక్కువగా ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉసిరికాయను తినకూడదు.
* ఏదయినా రక్త రుగ్మతతో బాధపడేవారు ఉసిరిని తినడం మంచిది కాదు.
* శస్త్రచికిత్స ఏదయినా జరిగినా లేదా శస్త్రచికిత్స చేయించుకునేవారైనా ఉసిరిని తినకూడదు.
* బిపి తక్కువగా ఉన్నవారు ఉసిరిని తినకూడదు.
* కడుపుతో ఉన్నవారు ఉసిరిని తినాలి అనుకుంటే డాక్టర్ ను కనుక్కొని తినాలి.
* పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ ను సంప్రదించిన తరువాతే ఉసిరిని తినాలి.
* డ్రై స్కార్ఫ్ లేదా డ్రై స్కిన్ సమస్య ఉన్న వారు ఉసిరిని తింటే వారి యొక్క ఆరోగ్య సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి వారు ఉసిరిని తినకూడదు.
*జలుబు, సైన్స్ తో బాధపడేవాళ్లు కూడా ఉసిరిని తక్కువగా తినాలి.

 

Also Read : Peanut Masala Curry : పల్లీలతో మసాలా కూర ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?