Cardamom: ఆ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా యాలకులు అస్సలు తినకండి?

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. ఏలకులు మంచి సువాసన ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని త

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 07:35 AM IST

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. ఏలకులు మంచి సువాసన ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా యాలకులు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యాలుకలు మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్న వారు రెండు యాలకులను నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య పోయి ఆరోగ్యంగా ఉండవచ్చు. యాలుకలలో ఉన్న బోలెడన్ని ఔషధ గుణాలు మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడతాయి.

అంతేకాదు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. యాలుకలు డిప్రెషన్ ను తగ్గిస్తాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి వేసుకుని తాగితే మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్ చేసే గొప్ప గుణాలు యాలుకలకు ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న యాలుకలు శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే యాలుకలు కొంతమందికి అస్సలు మంచిది కాదు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు యాలకులను అసలు తీసుకోకూడదట. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు యాలకులు తినకూడదు అన్న విషయానికి వస్తే..

గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో యాలకులు తీసుకోవడం మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు యాలుకలు తినే అలవాటు ఉంటే కచ్చితంగా ఒకసారి వైద్యున్ని సంప్రదించాలి. గర్భిణీగా ఉన్నప్పుడు యాలకులు తినకపోవడమే మంచిది. అంతేకాదు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు యాలుకలను అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా యాలకులను తీసుకుంటే వారికి శ్వాసకోశ సమస్యలు మరింత రెట్టింపు అవుతాయి. ఇక అలర్జీలతో బాధపడేవారు యాలకులు తీసుకోవడం మంచిది కాదు. యాలుకలు అలర్జీలను మరింత పెంచి అనవసరపు ఇబ్బందులను కలిగిస్తాయి. దగ్గు సమస్యతో బాధపడేవారు యాలకులు తీసుకోవడం మంచిది కాదు. అంతేకాదు బాగా వికారంగా అనిపించినప్పుడు కూడా యాలుకలు తీసుకోకూడదు. అలాంటి సమయంలో యాలుకలు తీసుకుంటే ఇబ్బంది ఎదురవుతుంది. వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ ఐదు సమస్యలు ఉన్నవారు యాలుకలకు దూరంగా ఉండడం మంచిది.