Cool Drinks : కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త..

ఎండాకాలం(Summer) అని కాకుండా మామూలుగా కూడా అన్ని రోజుల్లో అందరూ కూల్ డ్రింక్స్ తాగడం ఒక అలవాటుగా చేసుకున్నారు. కానీ దీని వలన మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
Cool Drinks Side Effects

Cool Drinks Side Effects

ఈ మధ్య కాలంలో అందరూ బయట దొరికే కూల్ డ్రింక్స్(Cool Drinks) తాగుతున్నారు. అలాగే ఎండాకాలం(Summer) అని కాకుండా మామూలుగా కూడా అన్ని రోజుల్లో అందరూ కూల్ డ్రింక్స్ తాగడం ఒక అలవాటుగా చేసుకున్నారు. కానీ దీని వలన మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అస్పర్టమ్ అనే కృత్రిమ తీపిని(Artificial Sweet) కూల్ డ్రింక్స్ లో వాడుతున్నారు. ఇది సుక్రోజ్ కంటే 200 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటుంది. కాబట్టి కూల్ డ్రింక్స్ తాగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అంతర్జాతీయ క్యాన్సర్(Cancer) పరిశోధన సంస్థ సమాచారం.

అన్ని దేశాలలోనూ కృత్రిమంగా తీపి కొరకు అస్పర్టమ్(Aspartame) అనే పదార్థాన్ని కోకో-కోలా, సోడాలు, చూయింగ్ గమ్ వంటి వాటిలో వాడుతున్నారు. ఆస్పార్టీక్ ఆమ్లం మరియు ఫినిలాలనైన ఆమ్లం రెండింటిని కలిపి కృత్రిమ తీపిని తయారుచేస్తారు. ఇంకా మిథనాల్ ను కూడా కలుపుతారు. 1965 లో జేమ్స్ ఎం స్లాటార్ అనే ఆయన అస్పర్టమ్ ను కనుగొన్నారు.

అప్పటి నుండి చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి కొరకు అస్పర్టమ్ ను వాడుతున్నారు. కాబట్టి కూల్ డ్రింక్స్ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది క్యాన్సర్ కారకాలు ఎక్కువగా మన శరీరంలో పెరగడానికి ఇవి దోహదం చేస్తాయి. కూల్ డ్రింక్స్ కాకుండా చూయింగ్ గమ్, డైట్ సోడా లలో కూడా అస్పర్టమ్ ని వాడుతున్నారు కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.

 

Also Read : Healthy Snacks For Diabetics: షుగర్ ఉన్నవారు సాయంత్రం ఈ స్నాక్స్ తింటే చాలు.. కంట్రోల్ లో ఉండడంతో పాటు?

  Last Updated: 04 Jul 2023, 08:50 PM IST