Site icon HashtagU Telugu

Periods: పీరియడ్స్ సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

Mixcollage 12 Feb 2024 12 52 Pm 6649

Mixcollage 12 Feb 2024 12 52 Pm 6649

స్త్రీలకు ప్రతి నెల నెలసరి రావడం అన్నది సహజం. ఈ సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మామూలుగా అమ్మాయిలకు ఈ నెలసరి సమయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళు లాగడం, అధిక రక్తస్రావం, నీరసం, చిరాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్ళు తిరగడం వంటి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత వర్క్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయితే పీరియడ్స్ సమయంలో ఆడవాళ్లు తెలిసి తెలియకుండా చేసేటటువంటి కొన్ని తప్పులు కారణంగా ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయట. మరి నెలసరి సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల బాడీ పై నీరసం, అలసిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పాలకూరలాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల పెరగడానికి సహాయపడతాయి. పైగా ఆకుకూరల్లో ఐరన్ తో పాటుగా ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి విరోచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాఫీకి బదులుగా అల్లం టీ తాగడం మంచిది. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దానివల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా వికారం వాంతులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అయితే ఒక రోజుకు నాలుగు గ్రాములు అల్లం కంటే ఎక్కువగా తీసుకోవద్దు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో చాక్లెట్లు తినమని అందరూ చెబుతూ ఉంటారు.

అయితే పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో అధిక శాతం ఐరన్ మెగ్నీషియం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో మాత్రమే డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుందంటే పొరపాటే పిఎస్ సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపించినా కూడా డార్కె చాక్లెట్ తో నివారించుకోవచ్చు. అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు తాజా ఫ్రూట్స్ ఇంకా నట్స్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారాన్ని వండుకోవడానికి సమయం లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికేటటువంటి జంక్ ఫుడ్ తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉప్పు, కారాలను ఉపయోగిస్తారు. వాటి వల్ల కడుపునొప్పి వాంతులు లాంటి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలకు ఇంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్ గురిచేస్తుంది. దాని వల్ల తలనొప్పి, కళ్ళు తిరగడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వీటితోపాటుగా జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఇక పీరియడ్స్ టైం లో వర్క్ అవుట్ చేస్తూ ఉంటారు. చాలామంది అయితే ఈ టైం లో వర్క్ అవుట్ చేస్తే కనుక కష్టమైనది అస్సలు చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా భారీ వర్కౌంట్స్ కడుపుపై కూడా చాలా వరకు వత్తిడి ని కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో స్నానం చేయడం మంచిదే కానీ యోగ ప్రకారం ఆయుర్వేద ప్రకారం పీరియడ్స్ టైం లో తలస్నానం చేయకూడదు.ఎందుకంటే తలపై నీళ్లు పోస్తే ప్రాణవాయువు అనేది కిందికి ప్రవహిస్తుంది. ఇది అసలు మంచిది కాదు. ఒకవేళ తలస్నానం చేయాలి అనుకుంటే గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. ఇక మరి కొంతమంది పీరియడ్స్ టైం లో రోజంతా కూడా నిద్రపోతూ ఉంటారు. కానీ రోజంతా నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలంలో నొప్పి, తిమ్మిరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా వాకింగ్ చేయాలి. దీనివల్ల మానసిక స్థితిని మెరుగు చేసేటటువంటి హార్మోన్లను పెంచుతుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి.

Exit mobile version