మీకు ప్రతిరోజూ నిమ్మరసం తాగే అలవాటు ఉందా? అది కూడా ఉదయం ఖాళీ కడుపుతో…!!ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే…ఎంత డేంజరో వైద్యులు చెబుతున్నారు. ఈమధ్య కాలంలో కొన్ని పరిశోధనల్లో కూడా ఇదే విషయం బయటపడింది. సాధారణంగా నిమ్మకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందనే సందేహం మీలో కలుగవచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ సిట్రస్ ఫ్రూట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు అందించడమే కాదు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు కొన్ని సమస్యలకు కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుకుందాం.
దంత క్షయం కావచ్చు!
రోజూ నిమ్మరసం తాగితే దంతాలు క్రమంగా పాడవుతాయి. ప్రధానంగా దంతాల ఉపరితల పొర దెబ్బతింటుందని చెబుతున్నారు వైద్యుల. దీనికి కారణం నిమ్మరసంలో ఉండే ఎసిడిటీ. నిమ్మరసం తాగిన తర్వాత సాధారణ నీటితో పుక్కిలించాలి. అంతేకాదు కొంతమందికి నిమ్మరసం తాగిన తర్వాత గుండెల్లో మంట వస్తుంది. అంతేకాదు నిమ్మరసాన్ని పడగడుపున తాగడం వల్ల వికారం, గుండెల్లో మంట కలుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఎసిడిటీకి దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులు గర్భిణీల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
కడుపు నొప్పి!
నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరికి గ్యాస్ట్రైటిస్ సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు. మిగతావాటి కంటే ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
మూత్రవిసర్జన!
కొందరికి డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. రోజూ నిమ్మరసం తాగేవారికి శరీరంలో ఆస్కార్బిక్ ఆమ్లం ఎక్కువగా పేరుకుపోతుంది. అధిక మూత్రవిసర్జనకు దారి తీస్తుంది. ప్రధానం మూత్రపిండాలను ప్రభావితం చేయడంతోపాటు ఎక్కువ నీటిని విసర్జించేలా చేస్తుంది.