Brushing: అన్నం తిన్న వెంటనే బ్రష్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ చేసే పని పళ్ళు శుభ్రం చేసుకోవడం. అయితే కొంతమంది ఇతర పనులు అన్ని

  • Written By:
  • Publish Date - January 10, 2023 / 06:30 AM IST

ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ చేసే పని పళ్ళు శుభ్రం చేసుకోవడం. అయితే కొంతమంది ఇతర పనులు అన్ని ముగించుకున్న తర్వాత బ్రష్ చేస్తే ఇంకొందరు మాత్రం లేచిన వెంటనే బ్రష్ చేస్తూ ఉంటారు. దంతాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. పళ్ళు శుభ్రం చేసుకోకపోతే నోటి దుర్వాసనతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా దంతాలను శుభ్రం చేసుకోకపోతే కాలక్రమమైన అవి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అయితే చాలామంది ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటలా బ్రష్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా రాత్రి భోజనం చేసి పడుకునే సమయంలో బ్రష్ చేసి పడుకుంటూ ఉంటారు. అయితే ఇలా బ్రష్ చేసే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.

మరి ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయవచ్చా అని చాలామంది అనుమాన పడుతూ ఉంటారు. ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం..చాలా మంది హార్ఢ్‌ బ్రిజల్స్‌ ఉపయోగిస్తే మెరుగ్గా పనిచేస్తాయనే ఆలోచనలో ఉంటారు. అయితే కఠినమైన బ్రిజల్స్‌ వల్ల దంతాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చిగుళ్ల నుంచి రక్తం రాకవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి పళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఎప్పుడూ కూడా సాఫ్ట్‌ బ్రష్‌ను ఉపయోగించాలి. మన చుట్టూ ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే రోజుల్లో రెండు సార్లు బ్రష్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఒక్కసారి మాత్రమే బ్రష్ చేస్తూ ఉంటారు.

కానీ ప్రతిరోజు కచ్చితంగా రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా మరింత స్ట్రాంగ్ తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. Alge చాలామంది తిన్న వెంటనే బ్రష్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనం తిన్న తర్వాత నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే నోటిలోని బ్యాక్టీరియా ఇతర సూక్ష్మ క్రిముల నుంచి రక్షిస్తుంది. కాబట్టి తిన్న వెంటనే బ్రష్ చేసుకోకుండా తినడానికి పడుకోవడానికి మధ్య రెండు గంటల సమయం గ్యాప్ ఉండేలా చూసుకుని పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోవడం మంచిది. చాలా మంది బ్రష్‌ను మార్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అయితే కచ్చితంగా ప్రతీ 3 నెలలకు ఒకసారి బ్రస్‌ మార్చాలని నిపుణులు చెబుతున్నారు. బ్రిజల్స్‌ వంగిపోయి కనిపించగానే బ్రష్‌ మార్చాలి.