Site icon HashtagU Telugu

Early Dinner Benefits: రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఆ రోగాల బారిన పడటం ఖాయం?

Early Dinner Benefits

Early Dinner Benefits

ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది సరిగ్గా భోజనం చేయక, కంటినిండా నిద్రపోక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. పనుల్లో పడి ఆహారం నిద్ర పై నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యల ఫాలో అవుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది రాత్రి సమయంలో 9 గంటల నుండి 11 గంటల లోపు భోజనం చేస్తున్నారు. ఇంకొంతమంది అర్ధరాత్రి 12 గంటలకు కూడా భోజనం చేసేవారు ఉన్నారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా యువత సెల్ ఫోన్ లలో కాలక్షేపం చేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి వరకు తిరిగి ఆలస్యంగా భోజనాలు చేస్తున్నారు.

దాంతో ఒక్కసారిగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. మరి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకోవడంతోపాటు సరైన నిద్ర తప్పనిసరిని. లేదంటే ఒబిసిటీ, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటుని మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చేయాలి.

అప్పుడే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల డయాబెటిస్‌ 2, గుండె జబ్బులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భోజనం విషయంలో సరైన సమయాలు పాటించాలి. ఎన్ని పనులు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా టైం టు టైం భోజనం చేయడం అన్నది తప్పనిసరి. రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అదనపు కేలరీలు కొవ్వు రూపంలో శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అధిక బీపీ, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.