Dogs Vs Cancer : కుక్కలకు వాసనా శక్తి చాలా ఎక్కువ. అందుకే అవి బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నాక.. బాంబులు, డ్రగ్స్‌ను ఇట్టే గుర్తించగలవు. కుక్కలకు ఉన్న ఈ పవర్‌ను ఆధారంగా చేసుకొని మన భారతదేశంలో ఒక స్టార్టప్ పుట్టుకొచ్చింది. దాని పేరే.. ‘డాగ్ నోసిస్’. ఈ సంస్థలోని పరిశోధకులు ఒక గొప్ప ఆవిష్కరణ చేశారు. ఆ వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మే 25 నుంచి మే 31 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
‘డాగ్‌నోసిస్’ కుక్క.. క్యాన్సర్‌ను ఇలా గుర్తిస్తుంది
- కుక్కలు(Dogs Vs Cancer) తమకు ఉండే వాసనా శక్తితో 28 రకాల వ్యాధులను గుర్తించగలవని ఇప్పటికే పలు అధ్యయనాల్లో గుర్తించారు.
- డాగ్ నోసిస్ కంపెనీ ఇప్పుడు కుక్కలకు ట్రైనింగ్ ఇస్తోంది. 98 శాతం కచ్చితత్వంతో క్యాన్సర్లను గుర్తించేలా వాటిని రెడీ చేస్తోంది.
- ఈ అవసరాల కోసం బీగిల్స్, ల్యాబ్రడార్ జాతి కుక్కలను వినియోగిస్తున్నారు.
- మనిషి శ్వాస తీసుకునే తీరును బట్టి అతడికి క్యాన్సర్ ఉందా? లేదా? అనేది తెలుసుకునేలా కుక్కలను సంసిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) విధానాన్ని డాగ్ నోసిస్ నిపుణులు రూపొందించారు. ఇందుకోసం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) డాగ్‌సెన్స్ అనే పరికరంతో పాటు ‘డాగోస్’ సాఫ్ట్‌వేర్, న్యూ మెషీన్ లెర్నింగ్ మోడల్స్‌ను వినియోగిస్తారు.
- ఈ పరీక్ష చేయించుకునే వ్యక్తి ప్రత్యేకంగా తయారుచేసిన మాస్కును 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఆ మాస్క్‌ను ప్రత్యేకమైన కిట్‌లో పెట్టి ల్యాబ్‌కు పంపుతారు.
- అనంతరం డాగ్ నోసిస్ వద్ద శిక్షణ పొందిన కుక్క ఆ ల్యాబ్‌లోకి వెళ్తుంది. ఈక్రమంలో అది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) డాగ్‌సెన్స్ పరికరాన్ని ధరించి ఉంటుంది.
- ఈ కుక్క.. ల్యాబ్‌లో ఉన్న మాస్క్ వాసనను చూస్తుంది. ఆ సమయంలో కుక్క మెదడులో జరిగే స్పందనలను ఈఈజీ అనే పరికరం రికార్డు చేస్తుంది.
- ఈ సమాచారాన్ని న్యూ మెషీన్ లెర్నింగ్ మోడల్స్, ‘డాగోస్’ సాఫ్ట్‌వేర్‌తో నిపుణులు విశ్లేషిస్తారు. తద్వారా సదరు వ్యక్తికి క్యాన్సర్ ఉందో లేదో ఓ నిర్ధారణకు వస్తారు.
- ఈ విధంగా 10 రకాల క్యాన్సర్లను గుర్తించే వీలుంది.
- క్యాన్సర్‌ను నాలుగో దశలో గుర్తిస్తే, వైద్యం అందించినా ఫలితం ఉండటం లేదు. ఈ సమస్య భారత్‌లో ఎక్కువగా ఉంది.
- ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే మరణాలను నివారించొచ్చు.
Also Read :KTR Vs Kavitha : కేటీఆర్ పట్టాభిషేకం ఆగినట్టేనా.. కవితకు కీలక పదవి ఇవ్వబోతున్నారా ?
ఎంసీఈడీ విధానం గురించి..
మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) విధానాన్ని కర్ణాటకలోని బెళగావికి చెందిన ఆకాశ్ కుల్‌గోడ్ డెవలప్ చేశారు.శునకాల శిక్షణలో నిపుణులైన ఇజ్రాయెల్‌కు చెందిన ఇటామర్ బిటన్‌తో కలిసి ఎంసీఈడీని కనుగొన్నారు. ఆకాశ్.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కాగ్నిటివ్ న్యూరోసైన్స్ కోర్సు చేశారు. ఆయన కెనైన్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్‌లో 3 అధ్యయనాలు చేశారు. ఒక మేధోహక్కును కూడా పొందారు. కర్ణాటకలోని 6 ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకొని ఆయన పరిశోధనలు చేస్తున్నారు.