వాకింగ్ (Walking ) ఎక్కువగా చేస్తే మోకాళ్లు, కీళ్లు అరిగిపోతాయన్న భయాలు కొంతమందిలో కనిపిస్తుంటాయి. కానీ ఈ అభిప్రాయం పూర్తిగా అపోహేనని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. వాస్తవానికి వాకింగ్ కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని పలు పరిశోధనలు నిరూపించాయి. రోజూ కొంతసేపు నడవడం వల్ల కీళ్ల చలనం మెరుగవుతుంది, శరీరంలోని నరాలు, కండరాలు చురుకుగా పనిచేస్తాయి.
Nicholas Pooran : 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నికోలస్ పూరన్
నిత్యం వాకింగ్ (Walking ) చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వేగంగా నడిచే అలవాటు పెరిగితే ఎముకల ఘనత (bone density) పెరుగుతుంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, నడకతో శరీర బరువు అదుపులో ఉంటుంది. ఎక్కువ బరువు వల్లే మోకాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉండి నొప్పులు వస్తాయి. కనుక బరువును నియంత్రించడంలో వాకింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
సరైన షూస్ లేకుండా వాకింగ్ (Walking ) చేస్తే మాత్రం మోకాళ్లకు హానికరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మంచి వాకింగ్ షూలు ధరించడం ముఖ్యం. అలాగే ఎప్పుడూ తక్కువ ఒత్తిడి ఉన్న తడారైన నేలపై నడక మొదలుపెట్టడం మంచిది. రోజూ కనీసం 30 నిమిషాలు నడకకు సమయం కేటాయిస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కూడా లభిస్తుంది. కాబట్టి “వాకింగ్ వల్ల కీళ్లు అరిగిపోతాయా?” అన్నదానిలో ఏమాత్రం నిజం లేదు.