Site icon HashtagU Telugu

Vitamin D: విటమిన్ డి లోపం వల్ల షుగర్ వ్యాధి వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 06 Dec 2023 05 35 Pm 3790

Mixcollage 06 Dec 2023 05 35 Pm 3790

శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరం. అటువంటి వాటిలో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి మనకు ఎన్నో రకాల ఆహార పదార్థాల ద్వారా మాత్రమే కాకుండా సూర్య రష్మి ద్వారా కూడా మనకు లభిస్తుంది. కొన్ని కొన్ని సార్లు విటమిన్ డి తక్కువ అయినప్పుడు కొంతమంది విటమిన్ డి కలిగిన టాబ్లెట్ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే శరీరంలో విటమిన్ డి తక్కువ అయితే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దంతాలు కండరాలు, ఎముకలు, బలహీన అవ్వడం, ఒంటినొప్పులు వస్తూ ఉంటాయి. పిల్లల్లో అయితే రికార్డ్స్ లాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శరీరంలో విటమిన్ డి లోపించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలు, గుడ్లు కూడా మంచివే పాలు మష్రూమ్స్ వెన్న లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డి లోపం తగ్గడం వలన చిన్న పిల్లలు, గర్భిణీలు పాలిచ్చే తల్లులు, యువత, వృద్ధులు ఇలా అందరిపై ఎంతో ప్రభావం పడుతూ ఉంటుంది. కావున కచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ విటమిన్ డి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక ఆహార లోపంతో చాలామంది ఇబ్బంది పడుతుండగా విటమిన్-డి కూడా అదనపు సమస్యగా మారుతుంది. దాంతో లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటూ ఉండాలి. దాంతో ఎండకు ఉండడం ముఖ్యంగా చలికాలంలో ఎండ తగిలేలా చేసుకోవడం ముఖ్యం. చాలామంది ఎండ కూడా తగలకుండా ఇంటిపట్టునే నీడలో ఉంటూ ఉంటారు.

కానీ అప్పుడప్పుడు అలా ఎండలో తిరగడం వల్ల సూర్యదశమి నేరుగా శరీరానికి తాగుతుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో కొద్దిసేపు సూర్యరశ్మిలో కూర్చోవడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఎండలో ఉండే ముందు కచ్చితంగా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాయాలని చెప్తున్నారు. అదేవిధంగా గర్భిణీలు కూడా రోజులో కాసేపు ఎండలో ఉండడం తల్లికి బిడ్డకి చాలా శ్రేయస్కరం. విటమిన్-డి మన శరీరంలో తగ్గిందంటే ముందుగా మన శరీరంలోకి డయాబెటిక్ తొంగిచూస్తుంది. మనను పీల్చి పిప్పి చేస్తుంది. మధుమేహం అటువంటి వ్యాధి, నియంత్రణలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. షుగర్ పెరగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు అలసిపోయి బలహీనంగా ఉంటారు. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. కణాలకు శక్తిని అందించడానికి ఇన్సులిన్ పనిచేస్తుంది. దీని లోపము మిమ్మల్ని అన్ని సమయాలలో అలసిపోయేలా చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు శక్తిని కాపాడుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Exit mobile version