Site icon HashtagU Telugu

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకూడదా.. వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Pregnancy

Pregnancy

సాధారణంగా వైద్యులు గర్భిణీ స్త్రీలను ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోమని చెబుతూ ఉంటారు. ప్రతిరోజు కొద్దిసేపు నడవడం వ్యాయమలు చేయడంతో పాటు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోమని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యులు సూచించిన మందులను తప్పకుండా ఉపయోగించాలి. అటువంటి వాటిలో ఐరన్ మాత్రలు కూడా ఒకటి. ఐరన్ మాత్రలను మహిళలు ఆరోగ్యానికి, సంతానోత్పత్తికి ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో పిల్లల ఎదుగుదల, తల్లి ఆరోగ్యం బాగుండాలని ఐరన్ మాత్రలను ఉపయోగించమని గర్భిణీ స్త్రీలకు వైద్యులు సూచిస్తూ ఉంటారు. అంతేకాకుండా గర్భధారణ సమయంలో తల్లికి ఐరన్ చాలా అవసరం.

వారి శరీరలో తగినంత ఇనుము తీసుకోకపోతే రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంది. చాలామంది గర్భిణీ స్త్రీలకు ఐరన్ టాబ్లెట్స్ విషయంలో ఒక భయం,అపోహ, అనుమానం ఉంది. అదేమిటంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ టాబ్లెట్లను తీసుకోవడం వల్ల పుట్టే శిశువు నల్లగా పుడతారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. గర్భధారణ సమయంలో ఐరన్ మాత్రలను వేసుకోవడం వల్ల పిల్లల రంగు ఏ మాత్రం మారదు. అది కేవలం అపోహ మాత్రమే. అయితే గర్భిణులకు ఐరన్ కంటెంట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్ తయారుచేయడానికి సహాయపడుతుంది. తల్లులు తగినంత ఇనుము తీసుకోకపోతే రక్తహీనత సమస్య బారిన పడే ప్రమాదముంది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

గర్భిణిగా ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ కంటెంట్ ఎక్కువగా అవసరమవుతుంది. శరీరంలో ఐరన్ లెవల్స్ బాగా ఉంటే జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఐరన్ లోపంతో రక్తహీనత సమస్య వస్తే పిల్లలు డెలివరీ డేట్ కంటే ముందే పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి శరీరంలో ఐరన్ లోపించడం వల్ల బిడ్డ మానసిక, శారీరక అభివృద్ధిపై చెడు ప్రభావం పడుతుంది. చాలా మంది మహిళల్లో ప్రెగ్నెన్సీ ప్రారంభంలో వారి శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. శిశువు శారీరక, మానసిక ఎదుగుదల కోసం గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఐరన్ మాత్రమే వేసుకోవాలి.