Site icon HashtagU Telugu

Vitamin D: ఎండలో నిలబడిన వెంటనే స్నానం చేస్తే విటమిన్ డి శరీరానికి అందదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Vitamin D

Vitamin D

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇది వైరల్ గా మారింది. అదేమిటంటే.. సూర్యరశ్మి ద్వారా శరీరం విటమిన్ డి ని ఎంత అబ్జార్బ్ చేసుకుంటోంది అన్నది మనం స్నానం చేసే సమయాన్ని బట్టి ఉంటుందంటూ పోస్ట్ వైరల్ గా మారింది.
అయితే ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక్కసారి విటమిన్ డి ని శరీరం గ్రహించిన తరవాత అది ఎక్కడికీ పోదని, లేయర్స్ రూపంలో లోపలే నిక్షిప్తమైపోతుందట.

స్నానం చేసినా కూడా ఆ విటమిన్లు ఎక్కడికీ పోవనిచెబుతున్నారు. కాగా విటమిన్ డి ఆరోగ్యానికి చాలా అవసరం. రోజూ శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాతంంగా ఉండవచ్చట. అయితే సూర్యరశ్మి తగిలిన తరవాత కాసేపటికే స్నానం చేస్తే విటమిన్ డి శరీరానికి అందదా అంటే అదేం లేదు అందులో నిజం లేదు అంటున్నారు. రోజూ కచ్చితంగా 10 నిముషాల నుంచి అరగంట వరకూ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలట.

అంటే ఆ సమయంలో ఎండలో నిలబడడమూ, కూర్చోవడమో చేయాలట. సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలట. పొట్టతో పాటు తొడలపైనా ఈ సూర్య కిరణాలు పడేలా చూడాలట. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలట. ఎగ్ లోపల ఉండే ఎల్లో తో పాటు మష్ రూమ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. అలా అని ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువసేపు ఎండలో ఉండడం అంత మంచిది కాదు. ఒకవేళ ఎండలో ఉన్నా కూడా 9 గంటల లోపు వచ్చే ఎండలో మాత్రమే ఉండాలట.