Honey: వేడి చేసిన తేనె విషమా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?

తేనె.. ద్రవ పదార్థాన్ని చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 10:15 AM IST

తేనె.. ద్రవ పదార్థాన్ని చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ కూడా పాడవ్వదు. తేనెలో ఆరోగ్యకరమైన ఎంజైమ్ లు,అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, డి, ఇ, కె, బి లు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటుగా బీటా కెరాటిన్, ఎసెన్షియల్ ఆయిల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి. ఈ తేనెను చాలామంది వేడిపాలలో, టీ లో, వేడి నీటిలో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ తేనే విషయంలో కొంతమంది తెలిసి తెలియక చేసే ఓ పనుల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

అదెలా అంటే వేడి మిశ్రమంలో తేనెను కలపడం వల్ల తేనె కూడా వేడెక్కుతుంది. ఇలా చేయడం వల్ల తేనె విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా తేనెలో ఉన్న పోషక విలువలు కూడా వాటి సుగుణాలను కోల్పోతాయి. అనగా ఆ తేనెను తీసుకున్న తీసుకోకపోయినా ఒకటే అని అర్థం. దీనిని వేడి చేయడం వల్ల అది జిగురులా మారుతుంది. కాబట్టి తేనెను వేడి చేయడం లేదంటే ఉడికించడం వంటివి చేయకూడదు.

అంతేకాకుండా వేడి పదార్థాలతో కూడా వీటిని కలుపుకొని తినకూడదు. ఇలా వేడికి తేనె తాకడం వల్ల అది విషపూరితమైన అణువులు జీర్ణ వ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకొని అమా అనే గా మారి కడుపునొప్పి రావడంతో పాటు శ్వాసక్రియ, ఇన్సులిన్, సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు బరువు పెరగడం వంటివి సమస్యలు తలెత్తుతాయి. కాగా ఒక నివేదిక ప్రకారం తేనెను వండడం వేడి చేయడం వల్ల వాటి నాన్నతో కూడా క్షీణిస్తుంది అని నివేదికలు వెలడయ్యింది.