Site icon HashtagU Telugu

Papaya: వేసవికాలంలో ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Papaya

Papaya

బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు విటమిన్లు లభిస్తాయి. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తరచుగా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం వేసవికాలం. వేసవికాలంలో బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుందో ముఖ్యంగా ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెల్లీ ఫ్యాట్ ని కరిగించాలి అనుకున్న వారు ఉదయమే పరిగడుపున బొప్పాయి తింటే సరిపోతుందట. ఇది ఆకలిని నియంత్రించడంతో పాటుగా అనారోగ్యకరమైన ఆకలినీ తగ్గిస్తుందని, ఇన్ని లాభాలు ఉన్న బొప్పాయిని వేసవిలో తినడం ఇంకా మంచిదని చెబుతున్నారు. అందుకు కారణం ఈ పండుకి మన శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణం ఉంది. అందుకే సమ్మర్ లో తప్పకుండా ఉదమయే రోజూ బొప్పాయి తినాలని చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున ఈ పండు తింటే అనారోగ్యాలన్నీ దూరమైపోతాయట. ఇందులో ఉండే ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు పలు పోషకాలు బాడీని ఫిట్ గా మార్చేస్తాయని చెబుతున్నారు. పైగా ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయట. అందుకే ఎంత తిన్నా బరువు పెరిగేందుకు అవకాశమే ఉండదని, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంతో పాటు విటమిన్ ఎ, సి, ఈ, కే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇది బరువు తగ్గాలనుకునే వాళ్లకీ బాగా పని చేస్తుంది.

బెల్లీ ఫ్యాట్ ని కరిగించాలనుకుంటే ఉదయమే పరిగడుపున బొప్పాయి తింటే సరిపోతుందట. ఇది ఆకలిని నియంత్రించడంతో పాటు అనారోగ్యకరమైన ఆకలినీ తగ్గిస్తుందట. అయితే ఇన్ని లాభాలు ఉన్న బొప్పాయిని వేసవిలో తినడం ఇంకా మంచిదట. అందుకే సమ్మర్ లో తప్పకుండా ఉదమయే రోజూ బొప్పాయి తినాలని చెబుతున్నారు. వేసవిలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. బాడీ డీహైడ్రేట్ అవకుండా కాపాడుతుందట. అంతే కాదు ఈ పండులో ఉండే విటమిన్స్, పోషకాలు, ఫైబర్ శరీరానికి అన్ని విధాలుగా మంచి చేస్తాయట. ఉదయమే పరిగడుపున బొప్పాయి తింటే మలబద్ధకం సమస్య తగ్గిపోతుందని చర్మ ఆరోగ్యమూ బాగుంటుందని చెబుతున్నారు. వేసవి రాగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చేస్తాయి. కడుపులో చల్లగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకునేందుకు ఇష్టపడతాం. వీటితో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాం. నిజానికి వేసవిలో డైట్ లో ఇలా మార్పులు చేసుకోవడం చాలా అవసరం కూడా. శరీరానికి ఎక్కువ మొత్తంలో నీరు అందాలి. వేసవిలో చెమటలు పడతాయి. ఈ చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రో లైట్స్ బయటకు వెళ్లిపోతాయి. అందుకే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే డైట్ బ్యాలెన్స్ అవుతుంది. రోజూ ఉదయమే బొప్పాయి ముక్కలు తింటే బాడీ హైడ్రేట్ అవుతుంది.