ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది నడుమునొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుము నొప్పికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ నడుము నొప్పి కొన్ని కొన్ని సార్లు తీవ్రమైనప్పుడు కూర్చోవడానికి పడుకోవడానికి నిల్చోడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నడుము నొప్పి రోజు వారి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇది పెద్ద జబ్బు కాదు అని అశ్రద్ధ చేస్తే మాత్రం కొన్ని కొన్ని సార్లు అది ప్రాణాల మీదకు తీసుకురావచ్చు అని చెబుతున్నారు. ఈ నడుము నొప్పి తగ్గించుకోవడానికి దగ్గర టాబ్లెట్స్ ఆయింట్మెంట్లు స్ప్రేలు యూస్ చేస్తూ ఉంటారు.
అయినప్పటికీ ఈ నడుము నొప్పి మాత్రం తగ్గదు. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బోర్లు పడుకునే అలవాటు ఉన్నవారు ఆ అలవాటును తగ్గించుకోవాలి. అదేవిధంగా కొన్ని సంవత్సరాల తరబడి ఒకే తరపున వాడడం అంత మంచిది కాదు. ఎక్కడైనా కింద గాని టేబుల్ మీద గాని కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవడం మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నిటారుగా ఉండి డ్రైవ్ చేయాలి. కంప్యూటర్ ముందు సిస్టం ముందు కూర్చుని వర్క్ చేసే వాళ్ళు పూర్తిగా వెనుక వైపు సీటుకి వీపుకి సపోర్ట్ తీసుకుని వర్క్ చేయడం మంచిది. లేదనుకుంటే ఒక దిండు లాంటిది సపోర్ట్ గా తీసుకోవడం మంచిది.
పాదాలు పూర్తిగా నేలను తాకాలి. కుర్చీ ఎత్తుగా ఉంటే పాదాల కింద ఎత్తు పెట్టుకోవాలి. వీపు వంపు దగ్గర చిన్న దిండు లేదా చున్నీ లాంటిది పెట్టుకోవడం వలన నడుము మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన చిన్న చిన్న ఎక్సర్సైజ్ లు చేయడం వలన కూడా నొప్పిని దూరం చేయవచ్చు. అలాగే కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరాన్ని కలిపి ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత చల్లార్చి ఒక డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు మర్దన చేసుకోవడం వలన నొప్పి కాస్త నెమ్మదిస్తుంది. అలాగే ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకూడదు. కొద్దిసేపు పడుకోవడం లేదంటే అటు ఇటు తిరగడం లాంటివి చేయాలి. సమయం దొరికినప్పుడల్లా నడుముకు సంబంధించి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం వల్ల ఈ నడుము నొప్పి సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఇవన్నీ ప్రయత్నించినా కూడా నడుము నొప్పి అలాగే ఇబ్బంది పెడుతుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.