కాఫీ.. ఈ పానీయానికి మనుషులు ఎంతగా ఎడిక్ట్ అయ్యారో మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం నాలుగు ఐదు సార్లు కాఫీలు టీలు తాగే వారు ఉన్నారు. అంతకంటే ఎక్కువ సార్లు తాగే వారు కూడా ఉన్నారు. ఇలా కాఫీ, టీలను తాగని వారు ఎవరూ ఉండరు. మనలో చాలా మంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీని తాగుతుంటారు. టీ, కాఫీలు మనల్ని రీఫ్రెష్ చేస్తాయి. తక్షణమే ఎనర్జీని ఇస్తాయి. ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. మెదడును చురుగ్గా చేస్తాయి. కానీ వీటిని రోజూ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ కాఫీని తాగడం వల్ల మీ కంటి చూపు దెబ్బతింటుందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కాఫీ లేదా టీ ని మితంగా మాత్రమే తీసుకోవాలట, లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాఫీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీలో ఉండే కెఫిన్, ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఎన్నో విధాలుగా మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. కాఫీ బరువు, కాలేయ ఆరోగ్యం లేదా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందట.
కానీ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, నిద్రలేమి, చంచలత, నిర్జలీకరణం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఎక్కువ కాఫీని తాగడం వల్ల దృష్టిపై ప్రభావం చూపుతుందట. అట్ జన్యుపరంగా కంటిని ఆకర్షించే వ్యాధి అయిన గ్లాకోమాతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీని ఎక్కువగా తాగడం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుందట. అయితే కాఫీని మితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదట. స్వీట్లను కంట్రోల్ చేయాల్సిన వారు కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చని చెబుతున్నారు. కాఫీని మితంగా తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చట. అయితే కాఫీని ఎట్టి పరిస్థితిలో ఎక్కువగా తాగకూడదట. ఇది ఏ రకంగానూ ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.