Non-Veg: నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుందా?.. అధ్యయనం ఏం చెబుతోందంటే?

మనలో చాలామందికి వెజ్ తో పాటు వారాంతాల్లో నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే నాన్ వెజ్ ఎలా లాగించేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 10:32 PM IST

Non-Veg: మనలో చాలామందికి వెజ్ తో పాటు వారాంతాల్లో నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే నాన్ వెజ్ ఎలా లాగించేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నాన్ వెజ్ తినే వారికి క్యాన్సర్ ముప్పు ఉంటుందనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. అయితే తాజాగా ఓ అధ్యయనం నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుందా? రాదా అనే విషయం మీద స్పష్టతనిచ్చింది.

60లక్షల మందిపై చేసిన 70 వేర్వేరు అధ్యయనాల ఫలితాలను విశ్లేషిస్తూ తాజా నివేదిక.. నాన్ వెజ్ తింటే క్యాన్సర్ ముప్పు మీద పలు కీలక అంశాలను వెల్లడించింది. మాసాహారం తగ్గించుకోవాలనే అధ్యయనాలు, ఆరోగ్య సూత్రాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాజా నివేదిక పేర్కొంది. నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, నిజానికి నాన్ వెజ్ తినడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందే వాదనలో నిజం లేదని చెప్పింది.

అయితే చాలాకాలంగా ప్రాసెస్డ్ మీట్ నిల్వ ఉండేందుకు వినియోగించే నైట్రేట్లు ప్రేగు క్యాన్సర్ కు కారణం అనే ప్రచారం నడుస్తోంది. కానీ శాకాహారాన్ని అధిక ఉష్ణోగ్రతల్లో వండినప్పుడు కూడా నైట్రోసమైన్లు ఏర్పడతాయి అని తాజా నివేదిక తెలిపింది. అంటే ఏ ఆహారం తింటున్నాం అనేది కాకుండా, ఆహారాన్ని ఎలా తయారు చేస్తున్నామన్నది ముఖ్యం అని నివేదిక పేర్కొంది. మాంసాహారమైనా, శాకాహారమైనా వండే విధానాన్ని బట్టి క్యాన్సర్ ముప్పు ఆధారపడి ఉందని నివేదిక వెల్లడించింది.

ఇక పంది మాంసం తినే వాళ్లలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనే ప్రచారం చాలాకాలంగా ఉండటం తెలిసిందే. కానీ ఇందులో అసలు నిజం ఏంటో అని తాజాగా నివేదిక వెల్లడించింది. పంది మాంసం తినే ప్రతి వెయ్యి మందిలో 56 మందికి మాత్రమే క్యాన్సర్ ముప్పు ఉన్నట్లు గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. క్యాన్సర్ అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందని నివేదిక వివరించింది.