Ghee: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

నెయ్యి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికి తెలిసిందే. నెయ్యిని ఎన్నో

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 06:30 AM IST

నెయ్యి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికి తెలిసిందే. నెయ్యిని ఎన్నో రకాల వంటకాలలో అలాగే స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. వేడివేడి అన్నంలో ముద్ద పప్పు ఆవకాయలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ అనుభూతి, టేస్ట్ అద్భుతం అని చెప్పవచ్చు. అయితే నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ నెయ్యి విషయంలో చాలామందికి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. మరి ముఖ్యంగా నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందని, నెయ్యి తింటే లావు అవుతారని, నెయ్యి తింటే షుగర్ పెరుగుతుందని ఇలా ఎన్నో రకాల అపోహలు తలెత్తుతూ ఉంటాయి.

ఇకపోతే నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ప్రతిరోజు ఒక స్పూను నెయ్యి తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలురావు మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావు వీటితో పాటు గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి వీటి ద్వారా శరీరంలో త్వరగా కొవ్వు కరుగుతుంది. నెయ్యి తింటే కొవ్వు ఎక్కువ అవుతుందని, అరగదనీ, రకరకాల అనుకుంటూ ఉంటారు. అయితే నెయ్యి తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది అన్నది కేవలం అపోహలు మాత్రమే. నెయ్యిలో అత్యవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.

వీటి కారణంగా రక్త నాలాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చాలామంది నెయ్యి తినడం వల్ల అరగదు అని నెయ్యిని తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఉండే ఫ్యాటి యాసిడ్స్ వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. నెయ్యి ఒత్తిడిని తగ్గించే ప్రశాంతతను ఇస్తుంది. నెయ్యి లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరస్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.