Drinking Water After Meals: మీరు కూడా భోజనం చేసిన వెంటనే గ్లాసుడు నీళ్లు తాగుతున్నారా? చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుందని మీకు తెలుసా? నీరు మన శరీరానికి ప్రాణాధారం. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మన మూడ్‌ని బాగు చేస్తుంది. శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలకు సహాయపడుతుంది. అయితే కొన్నిసార్లు తప్పుడు సమయంలో నీరు తాగడం వల్ల మీరు సమస్యల్లో పడవచ్చు. దీనివల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందితో సతమతమవ్వాల్సి వస్తుంది.
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం సరైనదేనా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనానికి ముందు లేదా భోజనం చేసిన వెంటనే నీరు తాగడం మానుకోవాలి. మనం తిన్న ఆహారం అరగడానికి సుమారు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. అదే ద్రవ పదార్థాలు (నీరు వంటివి) కడుపు నుండి 20-30 నిమిషాలలోనే వెళ్ళిపోతాయి. భోజనం చేసిన వెంటనే నీరు తాగితే అది మన జీర్ణ ఎంజైమ్‌ల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, కడుపులో భారంగా అనిపించడం లేదా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
Also Read: ధోనీ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన డి కాక్!
నీరు తాగడానికి సరైన సమయం- పద్ధతి
భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే భారీగా నీరు తాగడానికి బదులుగా భోజనానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు తాగడం ఉత్తమమని భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ ఎంజైమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆహారం సులభంగా అరుగుతుంది. నీరు తాగే అలవాటును సరైన సమయంలో పాటించడం వల్ల కడుపుకు ఉపశమనం లభిస్తుందని, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
