మగవారిలో జుట్టు రాలిపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, టెన్షన్లు, హార్మోన్లలో మార్పులు, పోషకాహార లోపం, జన్యుపరమైన కారకాలు, పర్యావరణ మార్పులు ఎన్నో రకాల కారణాల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది.జుట్టు రాలడం ఆపడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హెయిర్ ఆయిల్స్, షాంపూలు ఉపయోగించిన కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే మగవారు తాగే కూల్డ్రింక్స్ హాట్ డ్రింక్స్ వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
జుట్టు పెరగటం కోసం జిఎన్ఎ ఎక్కువగా కలిగి ఉన్న ఆయిల్స్ ని తలకి పట్టించడం వల్ల హెయిర్ లాస్ తగ్గటమే కాకుండా మగవారిలో జుట్టు పెరగడానికి కూడా కారణం అవుతుంది. జుట్టు మీద తగిన శ్రద్ధ మగవారు కూడా తీసుకోవాలి. అలాగే బి కాంప్లెక్స్ తక్కువైనా కూడా జుట్టు రాలిపోతుందట. కాబట్టి సరైన పోషకాహారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడానికి కారణమైన శీతల పానీయాలని, హాట్ డ్రింక్స్ ని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడం మంచిదని చెబుతున్నారు.
గోరువెచ్చని నూనెని రాత్రిపూట తలకి మసాజ్ చేసి అలాగే వదిలేయాలి. మరుసటి రోజు మైల్డ్ షాంపూతో స్నానం చేయడం వలన హెయిర్ లాస్ చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. అయితే హెయిర్ లాస్ అనేది వృద్ధాప్యం వలన కూడా జరుగుతుందట. కాబట్టి వీలైనంతవరకు కూల్ డ్రింక్స్ కి, హాట్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.