Site icon HashtagU Telugu

Cool Water: ఏంటి వేసవికాలంలో కూల్ వాటర్ తాగితే చనిపోతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Cool Water

Cool Water

మనిషికి నీరు అన్నది చాలా అవసరం. అన్నం తినకుండా అయినా ఉండగలమేమో కానీ నీరు తాగకుండా ఉండలేము. ముఖ్యంగా వేసవి కాలంలో నీరు తాగకుండా సర్వైవ్ అవడం అన్నది చాలా కష్టం. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు రోజుల్లో కనీసం నాలుగు నుంచి ఆరు లీటర్ల నీటిని అయినా తాగుతూ ఉంటారు. అయితే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు ఎక్కువ శాతం మంది కూల్ వాటర్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కూల్ వాళ్లతో పాటు కూల్ డ్రింక్స్ అలాగే బయట దొరికే డ్రింక్స్ లో కాస్త ఐస్ కలుపుకొని తాగుతూ ఉంటారు.

అయితే ఇలా వేసవికాలంలో చళ్లనీరు తాగడం వల్ల చనిపోతారు అంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి.. ఆ విషయాల గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని సందర్భాల్లో చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువట. కేవలం కొన్ని అరుదైన సందర్భాల్లో జరుగుతుందని చెబుతున్నారు. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఇది అల్పోష్ణస్థితి షాక్‌ ను కలిగించే అవకాశం ఉంటుందట. అందుకే గుండె జబ్బులతో బాధపడే వ్యక్తులకు చల్లటి నీరు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

అలాగే చల్లటి నీరు తాగడం వలన కడుపులో అసౌకర్యం, వాంతులు లేదా జీర్ణశయ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయట. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు లేదా, కొద్దిగా చల్లటి నీరే తాగాలని చెబుతున్నారు. శారీరక శ్రమ చేసిన తరువాత చల్లటి నీరు తాగడం అనేది అత్యంత ప్రమాదకరమని, దానిని కచ్చితంగా మానేయాలని చెబుతున్నారు. చల్లటి నీరు తాగిన తర్వాత, మీకు అసౌకర్యం లేదా ఛాతిలో నొప్పి ఉన్నట్లు అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలని చెబుతున్నారు. చల్లని నీరు తాగడం వలన మరణం అనేది సంభవించదట. కాకపోతే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులు ఈ నీటిని తాగడం వల్ల కచ్చితంగా పలు ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే చల్లటి నీరు తాగే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version