Alcohol: టీ, కాఫీ తాగితే మద్యం మత్తు దిగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

సాధారణంగా అతిగా మద్యం సేవించిన వారిని మతిస్థిమితం లేని వారు అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మద్యం సేవించినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో ఎల

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 05:45 PM IST

సాధారణంగా అతిగా మద్యం సేవించిన వారిని మతిస్థిమితం లేని వారు అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మద్యం సేవించినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మాట తడబడడం చూపు మసకబారడం సరిగ్గా నిలబడలేక పోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ మత్తు ప్రభావం వల్ల ఏం చేస్తున్నా వారికి తెలియదు. మద్యం సేవించిన తర్వాత చాలామంది మజ్జిగ తాగడం వల్ల తాగిన మైకం అంతా దిగుతుంది అని అంటూ ఉంటారు. మరి కొంతమంది టీలు, కాఫీలు తాగడం వల్ల తాగిన మత్తు దిగిపోతుందని అంటూ ఉంటారు. మరి నిజంగానే కాఫీలు టీలు తాగడం వల్ల తాగిన మత్తు దిగుతుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా మద్యం సేవించినప్పుడు అది కడుపు, చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోకి చేరుతుంది.

కాలేయానికి చేరుకున్న ఆల్కహాల్ జీవక్రియ చేయబడుతుంది. లివర్ గంటకు నిర్దిష్ట మొత్తంలో ఆల్కహాల్‌ను మాత్రమే జీవక్రియ చేస్తుంది. మెటబాలిజం కానీ ఆల్కహాల్ రక్తంలో ఉంటుంది. ఆల్కహాల్ మత్తు లక్షణాలు. ఎంత తాగుతున్నాం, శరీర బరువు, జీవక్రియ సామర్థ్యం, ఆల్కహాల్ టొలెరెన్స్ పై ఆధారపడి ఉంటుంది. మరి మద్యం మత్తును కాఫీ ఎలా ప్రభావితం చేస్తుంది అన్న వివరాల్లోకి వెళితే.. టీ, కాఫీలు ఆల్కహాల్ మెటబాలిజంను ప్రభావితం చేయవు. అంటే కాఫీ తాగడం వల్ల మత్తు పోవడం జరగదు. టీ, కాఫీలు తాగితే చురుకుగా అనిపిస్తుంది. అందులోని కెఫిన్ వల్ల అలా అనిపిస్తుంది. కానీ కెఫిన్ ఆల్కహాల్‌ పై ఎలాంటి ప్రభావం చూపదు.

మత్తు త్వరగా దిగిపోవడానికి, ఆల్కహాల్ ప్రభావం తగ్గించడానికి ఎలాంటి మార్గాలు లేవు. టీ, కాఫీలు తాగడం, చల్లని నీటిని మీద కుమ్మరించడం, ఐస్ క్రీమ్ తినడం, పెరుగు తాగడం లాంటి వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎంత సమయం పాటు రక్తంలో ఆల్కహాల్ ఉంటుందనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. నిద్రపోతే మత్తు దిగిపోతుందా? రాత్రి తప్పతాగి రాత్రంతా నిద్రపోయి తెల్లారి లేచే సరికి మద్యం మత్తు మొత్తం దిగిపోతుందా అంటే కాదనే చెప్పాలి. నిద్రకు రక్తంలో కలిసిన ఆల్కహాల్ కు ఎటువంటి సంబంధం లేదు. నిద్రపోయి లేచినంత మాత్రాన శరీరంపై, మెదడు పనితీరుపై ఆల్కహాల్ ప్రభావం తగ్గిపోదు. శరీర బరువు, జీవక్రియ వేగం, ఆల్కహాల్ టొలెరెన్స్ వల్ల మాత్రమే మత్తు దిగుతుంది.