Beer: బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ కిడ్నీకి సంబంధిం

Published By: HashtagU Telugu Desk
Mixcollage 23 Feb 2024 09 13 Pm 9627

Mixcollage 23 Feb 2024 09 13 Pm 9627

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది కిడ్నీలో రాళ్ల సమస్యలతోనే బాధపడుతున్నారు. ఈ కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చినప్పుడు మనకు వెనుక భాగం నొప్పిగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు చాలామంది చాలా ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది బీరు తాగితే కిడ్నీలో స్టోన్ కరిగిపోతుందని అంటూ ఉంటారు. అదేపనిగా మద్యపానం చేస్తుంటారు. నిజంగా బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరిగిపోతాయా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్ళను కరిగించేందుకు బీరు తాగడమే ఉత్తమ చికిత్స అని భావించేవారు ప్రతి ముగ్గురిలో ఒకరు ఉన్నారు అని తెలుస్తుంది. అయితే బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనిది కేవలం వాదన మాత్రమేనని ఇది ఎంత మాత్రం నిజం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీరు తాగితే మూత్ర విసర్జన పెరుగుతుందట. మూత్రం పోతోపాటు రాళ్లు కూడా కరిగిపోతాయని కొందరు నమ్ముతున్నారు.. కానీ అది కేవలం అపోహ మాత్రమేనట. బీరు తాగడం వల్ల పెరిగిన మూత్ర విసర్జనతో మూత్ర ప్రవాహంలో మూడు మిల్లీమీటర్ల పరిణామం కలిగిన రాళ్ళ గుళికలు బయటికి వస్తాయి.

అంతే కానీ బీరు తాగడానికి కిడ్నీలో రాళ్లు కరగడానికి ఏమాత్రం సంబంధం లేదంటున్నారు వైద్యులు. అధికంగా బీరు తాగడం వలన అధిక బరువు, కాలయానికి హాని కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లు కరిగించేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బీన్స్, తాజా కూరగాయలు, దానిమ్మ వంటి తీసుకోవడం వల్ల కిడ్నీలు రాళ్లు తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ బీరు తాగడం వలన కిడ్నీలో రాళ్లు కరుగుతాయనేది అపోహ మాత్రమే.

  Last Updated: 23 Feb 2024, 09:17 PM IST