Sleep: పగలు సమయంలో నిద్ర ఇబ్బంది పెడుతోందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

ప్రస్తుత రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య కారణంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..రా

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 07:37 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య కారణంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..రాత్రులు సరిగ్గా నిద్ర పట్టక పగల సమయంలో ఎక్కువగా నిద్రపోతున్నారు.. ఈ పగలు సమయంలో నిద్ర కొంతమందిని. మరి పగలు సమయంలో నిద్ర ఇబ్బంది పడుతుంటే ఏం చేయాలి? ఎలా అరికట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పగటిపూట నిద్రపోతే పనిచేయాలని అనిపించకపోవడం మాత్రమే కాకుండా, మీ ఉత్పాదక శక్తి కూడా దెబ్బతింటుంది. చాలామందికి పగటిపూట పనిచేస్తున్న సమయంలో విపరీతమైన నిద్ర వస్తుంది.

దీంతో వారు వారు చేసే ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. అప్పుడు ఏం చేయాలంటే.. చాలామంది రాత్రి సమయంలో ఎక్కువగా మెలకువగా ఉండి పగటిపూట నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోయే వారిలో స్లీపింగ్ సైకిల్ చెడిపోతుంది. స్లీపింగ్ సైకిల్ చెడిపోతే శారీరకంగానూ అనేక రుగ్మతలు వస్తాయి. సదరు వ్యక్తుల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి పగటిపూట నిద్రను నివారించడానికి ముందు రాత్రి పూట నిద్రపోయే సమయాన్ని సెట్ చేసుకోవాలి. రాత్రి 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోతే పగటిపూట నిద్ర సమస్య రాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇక పగటిపూట నిద్రకు అలవాటు పడితే కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, నిద్ర వచ్చినట్టు అనిపిస్తే పదినిమిషాలపాటు నడక మిమ్మల్ని శక్తివంతం చేస్తుందని, నిద్ర పోకుండా ఆపుతుంది అని చెబుతున్నారు.

అప్పటికి కూడా మిమ్మల్ని నిద్ర దేవత ఆవహిస్తుంటే ఒక గంట సేపు నిద్రపోయి ఆపై మళ్ళీ ఫ్రెష్ గా లేచి పని చేసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రిపూట నిద్రపోకపోతేనే పగటిపూట నిద్ర వస్తుందని, ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే రాత్రి నిద్రపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి..రాత్రి నిద్ర పోకుంటే పగలంతా బద్ధకంగా నిద్ర వస్తున్నట్టుగా, సోమరితనంగా అనిపిస్తుందని చెబుతున్నారు. పగటిపూట ఎక్కువగా మంచం మీద పడుకోవడం మానుకోవాలని, అప్పుడు పగటిపూట నిద్ర రాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఏదిఏమైనా రాత్రి నిద్ర మనిషి జీవితంలో కీలకమైన భాగం.