Coffee: కాఫీ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. టీ తాగేవారిలాగే కాఫీ ప్రియులు కూడా తక్కువేమీ కాదు. అయితే పాలు కలిపిన టీ కంటే కాఫీ వల్ల కలిగే నష్టాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతుంటారు. ఒక తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు కాఫీని ‘యాంటీ ఏజింగ్ డ్రింక్’గా గుర్తించారు. టెలోమెర్ బయాలజీ రీసెర్చ్ ప్రకారం.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందని, అయితే కాఫీలోని పాలిఫెనాల్స్, క్లోరోజెనిక్ యాసిడ్స్ మెటబాలిక్ సిగ్నలింగ్, సెల్యులార్ ప్రొటెక్షన్‌లో సహాయపడతాయని తేలింది. తద్వారా కాఫీ వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కాఫీ వృద్ధాప్యాన్ని ఎలా తగ్గిస్తుంది?
కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల టెలోమెర్స్ పరిమాణం తగ్గి, త్వరగా వృద్ధాప్యం వస్తుంది. కాఫీ ఈ ఒత్తిడిని తగ్గించి, పరోక్షంగా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.
కాఫీలోని పాలిఫెనాల్స్ మెటబాలిక్, ఇన్‌ఫ్లమేటరీ మార్గాలపై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల టెలోమెర్ స్థిరత్వానికి మద్దతు లభిస్తుంది. క్రమం తప్పకుండా కాఫీ తీసుకోవడం వల్ల ఈ పోషకాలు శరీరానికి అందుతాయ. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో సహాయపడుతుంది.
Also Read: 10 గ్రాముల బంగారం ధర రూ. 40 లక్షలా?!
అలాగే కొన్ని మానసిక రుగ్మతలు బయోలాజికల్ స్ట్రెస్‌ను పెంచి టెలోమెర్స్‌పై ప్రభావం చూపుతాయి. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు అటువంటి సమయాల్లో సెల్యులార్ మద్దతును అందిస్తాయి. వీటితో పాటు జీవనశైలి, ఆహారం, నిద్ర, శారీరక శ్రమ కూడా వృద్ధాప్యాన్ని ప్రభావితం చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పానీయాలు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పానీయాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి టెలోమెర్స్‌కు మేలు చేస్తాయి. కాఫీతో పాటు గ్రీన్ టీ, కొన్ని పండ్ల రసాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి.
కాఫీని సమతుల్య ఆహారంలో భాగంగా ఎలా మార్చుకోవాలి?
- సమతుల్య ఆహారం అంటే అన్ని రకాల పోషకాలు సరైన మోతాదులో ఉండటం. కాఫీని మీ ఆహారంలో ఇలా చేర్చుకోవచ్చు.
- రోజుకు 2 కప్పుల కాఫీ తాగవచ్చు. దీనివల్ల శరీరానికి అవసరమైన పాలిఫెనాల్స్ అందుతాయి.
- కెఫిన్ ఉన్న, కెఫిన్ లేని కాఫీ రెండింటినీ తీసుకోవచ్చు.
- కాఫీని కేవలం పానీయంగానే కాకుండా బేక్ చేసిన కుకీలు, కేకులు, ఇతర వంటకాల్లో కూడా వాడుకోవచ్చు.
- కాఫీతో పాటు పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
- ఏదైనా అతిగా తీసుకుంటే ప్రమాదమే. అందుకే మితిమీరిన కాఫీ సేవనాన్ని నివారించండి.
