Site icon HashtagU Telugu

Weight Loss: బరువు పెరిగిపోతున్నామని ఆందోళన పడుతున్నారా.. అయితే క్యారెట్ తో ఇలా చేయాల్సిందే!

Weight Loss

Weight Loss

ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దానికి తోడు ప్రస్తుతం దొరుకుతున్న ఆహారపు పదార్థాలు బయట దొరికే ఫుడ్స్ కూడా అలాగే ఉన్నాయి. చిరు తిండ్లు, జింక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. అయితే బరువు పెరిగినవారు బరువు ఎలా తగ్గాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. బరువు ఉన్నవారు ఇంకా బరువు పెరుగుతూనే ఉంటారు. ఇక బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నైన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇందుకోసం టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఇకమీదట అలా భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన పని లేదు అంటున్నారు.

అధిక బరువు సమస్య ఉన్న వారికి క్యారెట్ ఎంతో బాగా పనిచేస్తుందట. క్యారట్ లో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉండడమే. మరి క్యారెట్ తో ఎలా ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూ డైట్ లో క్యారట్ ని చేర్చుకోవాలని చెబుతున్నారు. కాల్షియం ఉండడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. రోజూ క్యారట్ తీసుకుంటే గాయాలు మానడంతో పాటుగా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుందట. క్యాన్సర్ లాంటి జబ్బుల ముప్పు కూడా తగ్గిపోతుందట. ​క్యారట్ జ్యూస్ తాగడం మంచిదే. అయితే ఇది కొంచెం తాగగానే కడుపు నిండినట్టుగా అనిపిస్తుందట.

ఎందుకంటే ఇందులో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటే త్వరగా జీర్ణమైపోతుంది. తక్కువగా ఉంటే మాత్రం కాస్త తాగగానే ఫుల్ గా అనిపిస్తుందట. అయితే కేవలం క్యారట్ జ్యూస్ మాత్రమే కాకుండా దాంతో పాటు మరి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఫలితాలు ఇంకా బాగుంటాయి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్ లాంటివి తీసుకోవాలి. వీటిని తినడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. పండ్లు తింటే ఆకలి తీరిపోతుందట. అలాగే రోజుకి ఒక కప్పు క్యారట్ తీసుకుంటే సరిపోతుందట. అంతకు మించి ఎక్కువ తీసుకోకపోవడమే మంచిదని,అయితే క్యారట్ తో పాటు అందులో పాలకూర లాంటివి వేసుకుని తాగితే ఫైబర్, పోషకాలు ఇంకాస్త ఎక్కువగా అందుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే కదా అని బరువు తగ్గిస్తుంది కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.